iDreamPost
android-app
ios-app

పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి దూకిన టీడీపీ సీనియర్‌ నేత కుమారుడు

పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి దూకిన టీడీపీ సీనియర్‌ నేత కుమారుడు

శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి కుమారుడు చౌదరి అవినాష్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆయన ఈ రోజు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌పై నుంచి దూకారు. మూడో అంతస్తు నుంచి అవినాష్‌ దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్‌ వద్దనే ఉన్న టీడీపీ కార్యకర్తలు అవినాష్‌ను శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు.

చౌదరి అవినాష్‌ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎస్‌ ఎం పురం సర్పంచ్‌గా పని చేశారు. గ్రామంలో నెలకొన్న పలు వివాదాల నేపథ్యంలో అవినాష్‌పై కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల అవినాష్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. ఈ రోజు కూడా స్టేషన్‌కు రమ్మని పిలవడంతో వచ్చిన చౌదరి అవినాష్‌ స్టేషన్‌ మూడో అంతస్తు ఎక్కి దూకారు.

అవినాష్‌ తల్లి ధనలక్ష్మీ శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ తాజా మాజీ చైర్మన్‌గా పని చేశారు. చౌదరి బాబ్జి ఆది నుంచి టీడీపీలో నమ్మకంగా పని చేశారు. ఎర్రన్నాయడు కారు ప్రమాదం సమయంలో చౌదరి బాజ్జి కూడా ఎర్రన్నాయుడుతో ఉన్నారు. ఆ ప్రమాదంలో చౌదరి బాబ్జి ప్రాణాలతో బయటపడ్డారు. తాజా ఘటనతో టీడీపీ కార్యకర్తలు స్టేషన్‌ ముందు దర్నా చేస్తున్నారు. స్టేషన్‌ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş