iDreamPost
android-app
ios-app

టీడీపీ బస్సు యాత్రలో అపశృతి.. ఒకరి మృతితో విషాదం! ఏమైందంటే..

టీడీపీ బస్సు యాత్రలో అపశృతి.. ఒకరి మృతితో విషాదం! ఏమైందంటే..

తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ఉమ్మడి గుంటూరు పరిధిలో బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో బుధవారం టీడీపీ బస్సు యాత్ర చేపట్టింది. టీడీపీ చేపట్టిన ఈ బస్సు యాత్రలో అపశృతి జరిగింది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనాల కూడా ఏర్పాటు చేశారు. ఇక భోజనాల సమయంలో తోపులాట జరిగి.. కోటేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త వేడిగా ఉన్న సాంబార్ డేక్షన్ పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు వెంటనే పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు.

అక్కడ కోటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు.. బాధితుడి శరీరం 70శాతం కాలిపోయినట్లు తెలిపారు..  గాయపడిన కోటేశ్వరావుని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడని సమాచారం. సమావేశం సమయం పది గంటలు దాటిపోవడం, ఏర్పాటు చేసుకున్న సభ ప్రాంగణం ఇరుకైన ప్రదేశంలో ఉండటంతో ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే భోజనాలు పెట్టే విషయంలో అజాగ్రత్త కారణంగా తోపులాట జరిగి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు. మరి.. ఈ అపశృతి జరగడానికి తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో..కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom