iDreamPost
android-app
ios-app

అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్విరాజ్’ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ..

  • Published Jun 08, 2022 | 7:00 PM Updated Updated Jun 08, 2022 | 7:00 PM
  • Published Jun 08, 2022 | 7:00 PMUpdated Jun 08, 2022 | 7:00 PM
అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్విరాజ్’ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ..

అక్షయ్ కుమార్, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ జంటగా భారతదేశ రాజుల్లో గొప్పవాడు, మహమ్మద్ ఘోరీ దండయాత్ర నుంచి భారతదేశాన్ని రక్షించిన యోధుడు పృథ్వీరాజ్ జీవిత కథ ఆధారంగా చంద్రప్రకాష్ ద్వివేది సామ్రాట్ పృద్విరాజ్ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని తెరకెక్కించింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ బాగానే వచ్చింది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోతుంది.

దీంతో ఈ సినిమాకి నార్త్ లో హిట్ టాక్ వచ్చినా పెట్టిన డబ్బులు కూడా ఇంకా రాలేదని సమాచారం, జూన్ 3న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే రోజు రిలీజ్ అయిన విక్రమ్, మేజర్ సినిమాలు దేశ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో పృథ్విరాజ్ సినిమాకి పాజిటివ్ టాక్ ఉన్నా డబ్బులు రావడంలేదు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకి మంచి న్యూస్ అందించాయి. భారతదేశాన్ని కాపాడిన గొప్ప రోజుల్లో పృథ్వీరాజ్ ఒకరు కావడం, ఆయన చరిత్రతో తెరకెక్కిన సినిమా కావడంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ప్రకటించారు.

“సామ్రాట్ పృథ్వీరాజ్” సినిమాకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించగా మరిన్ని రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయని పృథ్వీరాజ్ చిత్ర యూనిట్ తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet