iDreamPost
android-app
ios-app

మళ్ళీ వార్తలకెక్కిన తారా చౌదరి

  • Published Apr 30, 2020 | 5:46 PM Updated Updated Apr 30, 2020 | 5:46 PM
మళ్ళీ వార్తలకెక్కిన తారా చౌదరి

2012 లో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల ఆడియో టేప్ లీకులతో కొందరు సినీ రాజకీయ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి సంచలనంగా మారిన తారా చౌదరి రెండేళ్ల క్రితం ఓపెన్ హార్ట్ విత్ RK లో సైతం రాధాకృష్ణతో మాట్లాడుతూ పలువురితో ఉన్న సంబంధాల గురించి కొన్ని చీకటి వ్యవహారాల గురించి ఓపెన్ గా చెప్పి పలువురు పెద్దల ఆంతరంగిక వ్యవహారాలను బట్టబయలు చేసింది .

ఎందుకో తెలియదు కానీ ఓపెన్ హార్ట్ విత్ RK లో మాట్లాడిన తర్వాత ఆమె పబ్లిక్ లైఫ్ లో పెద్దగా కనపడలేదు . అయితే హఠాత్తుగా రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా పామూరులో తన భర్తని అకారణంగా హింసించాడని ఓ సబ్ ఇంస్పెక్టర్ పై ఆరోపణలు చేస్తూ మళ్లీ వార్తల కెక్కింది .

ప్రస్తుతం ప్రకాశం జిల్లా పామూరులో భర్త ,బిడ్డతో నివాసం ఉంటున్న తారా చౌదరి తన కుమారుడి మందుల కోసం బయటకు వెళ్లిన తన భర్తని స్థానిక ఎస్సై అకారణంగా కొట్టి హింసించారని , ఇదేమని ప్రశ్నించినందుకు నాటు సారా తాగాడని ఆరోపిస్తూ బ్రీతింగ్ ఎనలైజర్ తో టెస్ట్ చేశాడని , అలాగే నాటుసారా రవాణా చేశాడని అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు .

ఈ ఆరోపణలకు సాక్ష్యంగా తన భర్త వంటి పై ఎస్సై కొట్టినట్టుగా చెబుతూ కొన్ని గాయాల్ని కూడా సాక్ష్యంగా చూపించిన ఆ దంపతులు ఎస్సై పై మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు . సదరు ఎస్సై తమనే కాకుండా స్థానికంగా మరికొందరు అమాయకుల్ని కూడా హింసించాడని , ఇరవై రోజుల క్రితమే ఆ ఎస్సై ట్రాన్స్ఫర్ అయ్యాడని తమ ఎంక్వైరీలో తేలింది అని అలాంటి ఎస్సై ఇక్కడ ఇంకా ఎలా విధులు నిర్వహిస్తాడంటూ మరికొన్ని ఆరోపణలు చేశారు .

కాగా ఈ ఘటన గురించి పోలీసులు ఇంకా ఏ విధంగానూ స్పందించలేదని సమాచారం