iDreamPost
android-app
ios-app

ఈమె ప్రైవేట్ స్కూల్ లో టీచర్.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే..!

  • Published Oct 20, 2023 | 8:47 PM Updated Updated Oct 20, 2023 | 9:04 PM

తమిళనాడుకు చెందిన ఈ మహిళ పేరు ధనలక్ష్మి. కొంత వరకు చదువుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు ఓ యువకుడితో వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ భార్యాభర్తల సంసార జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది.

తమిళనాడుకు చెందిన ఈ మహిళ పేరు ధనలక్ష్మి. కొంత వరకు చదువుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు ఓ యువకుడితో వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ భార్యాభర్తల సంసార జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది.

  • Published Oct 20, 2023 | 8:47 PMUpdated Oct 20, 2023 | 9:04 PM
ఈమె ప్రైవేట్ స్కూల్ లో టీచర్.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే..!

తమిళనాడుకు చెందిన ఈ మహిళ పేరు ధనలక్ష్మి. కొంత వరకు చదువుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు ఓ యువకుడితో వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ భార్యాభర్తల సంసార జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇక భర్తకు ఆర్థికంగా తోడుగా నిలిచేందుకు ధనలక్ష్మి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేరింది. రోజూ స్కూల్ కు వెళ్తూ వస్తుండేది. ఎప్పటిలాగే గురువారం కూడా ధనలక్ష్మి స్కూల్ కు వెళ్లింది. కానీ, ఊహించని ప్రమాదంతో ఆ మహిళ నడి రోడ్డుపై ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు వేలూరు పరిధిలోని శలవన్ పేటలో ధనలక్ష్మి (36) అనే మహిళ నివాసం ఉంటుంది. కొంత వరకు చదువుకున్న ఆ మహిళ.. గతంలో తల్లిదండ్రులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇక భర్తకు ఆర్థికంగా తోడుగా నిలిచేందుకు ధనలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేరింది. ఇక రోజూ స్కూటీపై స్కూల్ కు వెళ్తూ వస్తుండేది. ధనలక్ష్మి ఎప్పటిలాగే గురువారం కూడా స్కూల్ కు వెళ్లింది. ఆమె స్కూటీపై కాట్పాడి సమీపానికి చేరుకోగానే ముందు నుంచి వస్తున్న ఓ వృద్ధుడి సైకిల్ ను తప్పించబోయి ఆ మహిళ డివైడర్ ను ఢీ కొట్టి కిందపడింది.

ఇదే సమయంలో వెనకాల నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆమెను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ధనలక్ష్మి నడి రోడ్డుపై తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ధనలక్ష్మి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş