iDreamPost
android-app
ios-app

తెలంగాణ వ్యక్తిని పెళ్లాడబోతున్నా మిల్కీ బ్యూటీ..!

తెలంగాణ వ్యక్తిని పెళ్లాడబోతున్నా మిల్కీ బ్యూటీ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లలో ఫుల్ పాలోయింగ్ సంపాదించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటించి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది. అయితే ఇటీవలే ఆమె.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజమేనంటూ ఈ బ్యూటీ కూడా ఒప్పేసుకుంది.  అతడు తెలంగాణకు చెందిన వ్యక్తి అంట. దీంతో మిల్కీ బ్యూటీ తెలంగాణ కోడలు కాబోతుందంటూ ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వర్మ ఎవరంటూ తెగ సెర్చింగ్ లు జరుగుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

విజయ్ వర్మ బాలీవుడ్ నటుడిగానే ఎక్కువ మందికి తెలుసు. తెలుగులో  నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా విజయ్ కనిపించాడు. ఆ సినిమాతో తెలుగులో విజయ్ మంచి గుర్తింపు పొందాడు. అతడు బాలీవుడ్ లో తొలుత నటించినప్పటికి..  అతను ఒక తెలుగు వాడు.. అందులోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే విషయం చాలా మందికి తెలియదు. విజయ్ వర్మ 1986 మార్చి 29న హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన తండ్రి హ్యాండీ క్రాఫ్ట్ బిజినెస్ చేసే వారు. తల్లి గృహిణి కాగా.. ఆయనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. విజయ్ కి బాల్యం నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.

అందుకే డిగ్రీ చదువు పూర్తికాగానే… 2005లో   ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి గ్రాడ్యూయోషన్ పూర్తి చేశాడు. అనంతరం కొన్ని రోజులు హైదరాబాద్ లో థియేటర్ ఆర్టిస్ట్ గా  కూడా పని చేశాడు. ఆ తరువాత 2008 షోర్ అనే  షార్ట్ ఫిల్మ్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం చిట్టగాంగ్, రంగేజ్, గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్ వంటి చిత్రాల్లో నటించాడు. ఇక 2016 తాప్సీ నటించిన పింక్ సినిమాతో విజయ్ వర్మ ఫేమస్ అయ్యాడు. ఇలా పలు సినిమాలో నటించిన విజయ్.. తమన్నాతో కలిసి మాత్రం ఒక మూవీలో కూడా నటించలేదు. ఇటీవలే ఈ జంట లస్ స్టోరీస్-2 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది.

ఆఫ్ స్క్రీన్ లో  ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. వెండి తెరపై ఎలా రెచ్చిపోయారో తెలియాలంటే.. ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా విజయ్ గురించి, అతనితో ప్రేమ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి వివాహం జరిగితే..తమన్నా తెలంగాణ కోడలు అవుతుందని చాలా మంది సినీ ప్రియులు అంటున్నారు. మరి.. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet