iDreamPost
iDreamPost
ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టిన సిక్కులు హిందువులు మాతృదేశమైన ఆఫ్ఘనిస్తాన్ కి తిరిగి రండి అని తాలిబాన్ విజ్ఞప్తి చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా సమస్యలు పరిష్కారమైయ్యాయని అని తాలిబాన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు ఆఫ్ఘనిస్తాన్ కి తిరిగి రావాలని తాలిబన్ ప్రభుత్వం కోరుతున్నది.
తాలిబాన్ మంత్రి డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ, జూలై 24న ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ – సిక్కు కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారని ఆఫ్ఘనిస్తాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం ట్వీట్ చేసింది.
కాబూల్‌లోని గురుద్వారాపై, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) చేసిన దాడిని ఆపినందుకు సిక్కు నాయకులు తమ తాలిబాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది.
తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, కాబూల్‌లోని “గురుద్వారా కార్తె పర్వాన్”ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ గురుద్వార్ తీవ్రవాదుల దాడికి నాశనం అయ్యింది. దీనికి మరమత్తులు చేసి, మైనారిటీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది తాలిబన్. తద్వారా ప్రపంచం ముందు తాము కూడా సెక్యులర్ అని నిరూపించుకోవాలన్నది తాలిబన్ నాయకత్వ ఉద్దేశం.