iDreamPost
android-app
ios-app

Taj Mahal Tejo Mahalaya తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా? ఆ 22 గ‌దుల్లో హిందూ విగ్ర‌హాలున్నాయా?

  • Published May 13, 2022 | 3:09 PM Updated Updated May 13, 2022 | 3:12 PM
Taj Mahal Tejo Mahalaya తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా? ఆ 22 గ‌దుల్లో హిందూ విగ్ర‌హాలున్నాయా?

తాజ్ మ‌హ‌ల్ ఎప్పుడూ సెల‌బ్రిటీల రాక‌తో వార్త‌ల్లోనే న‌లిగే క‌ట్ట‌డ‌మే. ఈసారి తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలని డిమాండ్‌ చేస్తూ  వేసిన పిటీష‌న్ పై, అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఇది కోర్టు ప‌రిధిలోని అంశంకాదు, తేల్చాల్సింది చ‌రిత్ర‌కారులేన‌ని చెప్పింది.

ఈ పిటీష‌న్ లో, తాజ్ మ‌హల్ ను ఎప్పుడు క‌ట్టార‌న్న‌దానిపై చ‌రిత్ర‌కారుల వాద‌న‌ల‌ను స‌వాల్ చేశారు. 1631 -1653 ఏళ్ల‌ మధ్య 22 ఏళ్ళ కాలంలో తాజ్ మహల్ నిర్మించారనే మాట వాస్తవంకాద‌ని , పిటిషనర్ పేర్కొన్నారు. అయోధ్యలోని బహ్రామౌ నివాసి అయిన డాక్టర్ రజనీశ్ సింగ్, ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయ‌న‌ బీజేపీ అయోధ్య జిల్లా కమిటీ సభ్యుడు. ఈ పిటిషన్ కు పార్టీకి, ఎలాంటి సంబంధం లేదని ఆయన చెబుతున్నారు.

తాజ్‌మహల్‌ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న 22 గదులను భారత పురావస్తు శాఖ తెరిచి, అందులో ఏముందో బైట‌పెట్టాల‌న్న‌ది పిటిషనర్ వాద‌న‌. ప్రభుత్వమే నిజ‌నిర్ధార‌ణ‌ కమిటీ ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్న‌ది ఆయ‌న మ‌రో డిమాండ్.

ఈ పిటిషన్‌లో పేర్కొన్న ‘తేజో మహాలయ’ అని పిలిచే ఆలయం ఉనికి గురించి చాలాసార్లు చర్చ జరిగింది. వాట్స‌ప్ గ్రూపుల్లో తెగ తిరిగే టాపిక్స్ లో ఇది ఒక‌టి. తేజో మహాలయను క్రీ.శ 1212లో రాజు పర్మార్దిదేవ్ నిర్మించారు. ఆత‌ర్వాత జైపూర్ రాజా మాన్‌సింగ్ ఆధీనంలోకి వెళ్లింది. రాజా జై సింగ్ వారసత్వ ఆస్తి ఇది. దీనికి ఆధారాలున్నాయ‌ని పిటీష‌న‌ర్ అంటున్నా, చ‌రిత్ర‌కారులు స్పందించ‌డంలేదు.

తేజో మహాలయ ప్రాంతాన్ని షాజహాన్ 1632లో ఆక్రమించారని కూడా పిటిషన్‌లో చెప్పారు. ఆయ‌న అక్క‌డితో ఆగ‌లేదు. తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న కొన్ని గదుల వెనక, శివాలయం ఉందని కూడా మీడియాతో ఆన్నారు.

చరిత్ర‌లో చ‌దువుకున్న‌దాని ప్ర‌కారం, 17వ శతాబ్దంలో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం, షాజహాన్ తాజ్ మహల్‌ను క‌ట్టారు. దీనికోసం 42 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, ప్లాన్ ను త‌యారుచేసి, విదేశాల నుంచి నిపుణుల‌ను ర‌ప్పించారు. తాజ్ మహల్ నిర్మాణ పనులు జనవరి 1632లో ప్రారంభమై 1655లో పూర్తయ్యాయి.

షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ లెక్క‌ల ప్రకారం, తాజ్ మహల్ నిర్మాణానికి అయిన ఖ‌ర్చు రూ.50 లక్షలు. ఈ ఖ‌ర్చు అంతా వేత‌నాలే. ఉప‌యోగించిన పాల‌రాతి ఖ‌ర్చును క‌ల‌ప‌లేదు. అందుకే మ‌రికొంద‌రు రూ.4కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు లెక్క‌వేశారు.

అల‌హాబాద్ కోర్టు తీర్పు నేప‌థ్యంలో తాజ్ మ‌హ‌ల్ ఎవ‌రిది? ఆ మూసిన 22 గ‌దుల్లో ఏముంది? అంశాల‌పై జ‌ర్న‌లిస్ట్ స్ప‌ప్న చ‌ర్చ‌ను నిర్వ‌హించారు. ప్లీజ్ వాచ్.