దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ2023 తాజాగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు యంగ్ స్టర్స్. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతూ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ. తన అరంగేట్ర మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కెప్టెన్, తెలుగు తేజం తిలక్ వర్మ రెండు మ్యాచ్ ల్లో జట్టును గెలిపించి సత్తా చాటాడు. తాజాగా మరో యువ బౌలర్ తన బౌలింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు సుయాశ్ శర్మ. తన తొలి మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సుయాశ్ దెబ్బకు మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. అతడికి తోడు సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లతో రాణించారు.
అనంతరం 116 పరుగుల స్వల్ప లక్ష్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ.. 3 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో విజయం సాధించింది. జట్టులో ఆయుష్ బదోని 44 పరుగులతో అజేయంగా నిలిచి విజయాన్ని అందించాడు. కాగా.. సుయాశ్ శర్మ ఈ సంవత్సరమే ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. అతడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగి.. 11 మ్యాచ్ లు ఆడి 8.23 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. మరి అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుతం చేసిన ఈ యంగ్ స్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Suyash Sharma picked 5/13 on his Delhi debut in the Syed Mushtaq Ali Trophy.
– A grand debut for Suyash! pic.twitter.com/GZwaabrrKJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 17, 2023