iDreamPost
android-app
ios-app

సూర్య-సుధా కొంగర కాంబో రిపీట్.. టైటిల్ ఫిక్స్

  • Published Oct 26, 2023 | 6:12 PM Updated Updated Oct 26, 2023 | 6:12 PM

సినీ ఇండస్ట్రీలో అతికొద్ది మంది మహిళా డైరెక్టర్లలో సుధా కొంగర ఒకరు. ద్రోహి అనే సినిమాతో కోలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ తెలుగింటి ఆడపడుచు.. మాధవన్‌తో ఇరుది సుట్రు అంటూ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కించింది. అదే సినిమాను తెలుగులో వెంకటేష్‌తో గురు పేరుతో రీమేక్ చేసింది. ఆ తర్వాత సూర్యతో కలిసి సూరారై పోట్రు చేయగా.. 6 జాతీయ అవార్డులను కొల్లగొట్టింది.

సినీ ఇండస్ట్రీలో అతికొద్ది మంది మహిళా డైరెక్టర్లలో సుధా కొంగర ఒకరు. ద్రోహి అనే సినిమాతో కోలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ తెలుగింటి ఆడపడుచు.. మాధవన్‌తో ఇరుది సుట్రు అంటూ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కించింది. అదే సినిమాను తెలుగులో వెంకటేష్‌తో గురు పేరుతో రీమేక్ చేసింది. ఆ తర్వాత సూర్యతో కలిసి సూరారై పోట్రు చేయగా.. 6 జాతీయ అవార్డులను కొల్లగొట్టింది.

  • Published Oct 26, 2023 | 6:12 PMUpdated Oct 26, 2023 | 6:12 PM
సూర్య-సుధా కొంగర కాంబో రిపీట్.. టైటిల్ ఫిక్స్

కోలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా.. అతడి సినిమాలంటే ఇష్టపడుతుంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. వైవిధ్యమైన కథ, కథనాలను ఎంపిక చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు సూర్య. హిట్స్, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. చిన్న పాత్ర ఇచ్చినా తన దైన స్టైల్లో సీన్ రక్తి కట్టిస్తుంటారు. ఇటీవల విక్రమ్ సినిమాలో ఆయన చేసిన రోలెక్స్ పాత్రే అందుకు ఉదాహరణ. ఆ పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఈటీ నిరాశపర్చినా.. కంగువాతో అభిమానుల్ని ఖుషి చేసేందుకు సిద్ధమయ్యారు సూర్య. ఇప్పుడు మరో మూవీ అప్ డేట్ వచ్చింది.

ఉత్తమ నటుడితో పాటు ఐదు జాతీయ అవార్డులను కొల్లగొట్టిన సూరరై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో సినిమా చేయబోతున్నారన్న వార్త తెలిసిందే. తాజాగా ఆ సినిమా టైటిల్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు పూరాణనూరు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేసింది నిర్మాణ సంస్థ టూడీ ఎంటర్ టైన్ మెంట్. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతోంది. సూర్య 43వ చిత్రంగా తెరకెక్కుతున్నఈ సినిమాను మీనాక్షి సినిమాస్ తో కలిసి సూర్యకు చెందిన నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్ మెంట్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది అతడి 100వ సినిమా కావడం విశేషం.

దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, నజ్రియా నజీమ్ తదితరులు ముఖ్య భూమికను పోషిస్తున్నారు. తమిళ సినిమాలకు విరామం ఇచ్చిన నజ్రియా చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ విలన్ గా నటిస్తున్నారని టాక్. వచ్చే నెలలో షూటింగ్ షురూ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య కాలేజ్ బాయ్ గా కనిపిస్తున్నారని సమాచారం. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కబోతున్న పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా అని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఈ కాంబో ఎన్ని అవార్డులు కొల్లగొడుతుందో చూడాలి. కాగా, పూరాణనూరు అనే పేరుతో తమిళ కవితా సంకలనం ఉంది. మరీ దీన్ని ఆధారంగా చేసుకునే సినిమా తెరకెక్కిస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by 2D_Entertainment (@2d_entertainment)

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom