iDreamPost
android-app
ios-app

R నారాయణమూర్తికి క్షమాపణలు చెప్పిన సుహాస్!

R నారాయణమూర్తికి క్షమాపణలు చెప్పిన సుహాస్!

టాలీవుడ్‌కు యంగ్ టాలెంట్ హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు వస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్, సోషల్ మీడియాలో సత్తా చాటి ఆ తర్వాత సిల్కర్ స్క్రీన్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. అటువంటి వారిలో సుహాస్ ఒకరు. మూవీస్‌లో నటించాలన్న ఫ్యాషన్‌తో విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చేసిన ఈ కుర్రాడు.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఛాయ్ బిస్కెట్‌లో షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. అరడజనుకు పైగా పొట్టి సినిమాల్లో నటించాక.. వెండి తెరపై ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. పడిపడి లేచే మనస్సు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో కనిపించారు. కమెడియన్, సహాయక పాత్రల నుండి హీరోగా, మెయిన్ విలన్‌గా మారాడు. తొలిసారిగా ఆయన నటించిన కలర్ ఫోటో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు.

ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును దక్కించుకుంది. హీరో అయ్యాక.. హీరోగానే కొనసాగుతానని గిరిగీసుకుని కూర్చోలేదు. ఏ పాత్ర వచ్చినా చేస్తూ.. తన మూలాలను మర్చిపోలేదు. రంగ్ దే, అర్థ శతాబ్దం, ఫ్యామిలీ డ్రామా, హిట్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా.. విలన్‌గా తనను తాను నిరూపించుకున్నారు. తర్వాత రైటర్ పద్మ భూషణ్ వంటి మంచి ఫీల్ గుడ్ మూవీలో నటించి మెప్పించాడు. ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. అయితే టీజర్ విడుదల కార్యక్రమాన్నిహైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.

తమ సినిమాకు తగ్గట్లుగా రియలిస్టిక్ గా ఉండాలనుకున్నచిత్ర యూనిట్.. ఈవెంట్ జరిగే చోట బ్యాండ్ ఏర్పాటు చేసి.. వాటిని వాయించారు. అయితే అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న మన పీపుల్ స్టార్స్, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ఆ సౌండ్స్ కు కాస్త చిరాకు పడ్డారట. ఈ విషయం హీరో సుహాస్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన దగ్గరకు వెళ్లి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే శివానీ, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దుశ్యంత్ కాటికినేని వహించారు. మరో దర్శకుడు వెంకటేష్ మహా, దుశ్యంత్ కాటికినేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతం శేఖర్ చంద్ర వహించారు.