iDreamPost
android-app
ios-app

ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను.. సుధీర్‌ ఎమోషనల్‌!

సుడాగాలి సుధీర్‌ ఓ మెజీషియన్‌ స్థాయి నుంచి నేడు ఓ హీరోగా ఎదిగారు. ఓ మంచి ఫ్యాన్‌ బేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ సుధీర్‌ అంటే ప్రాణం ఇచ్చేంతలా అభిమానాన్ని చూపిస్తున్నారు.

సుడాగాలి సుధీర్‌ ఓ మెజీషియన్‌ స్థాయి నుంచి నేడు ఓ హీరోగా ఎదిగారు. ఓ మంచి ఫ్యాన్‌ బేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ సుధీర్‌ అంటే ప్రాణం ఇచ్చేంతలా అభిమానాన్ని చూపిస్తున్నారు.

ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను.. సుధీర్‌ ఎమోషనల్‌!

ఓ మెజీషియన్‌గా జీవితాన్ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగారు సుడిగాలి సుధీర్‌. బుల్లి తెరలో వచ్చిన ‘జబర్థస్త్‌’ షోతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఓ హీరోకు ఉండే క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయనకు ఇంతలా స్టార్‌డమ్‌ రావటానికి ‍ప్రధాన కారణం ఆయన మంచి తనమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై ఎన్ని పంచులు వేసినా సుధీర్‌ తీసుకోవటం..అన్ని విషయాల్లో శాంతంగా ఉండటం ఫ్యాన్స్‌ గుండెల్ని తాకింది. దీంతో హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌గా తయారయ్యారు. సుధీర్‌ చేసే ప్రతీ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన నటించిన ‘కాలింగ్‌ సహస్త్ర’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించి సాంగ్‌ లాంఛ్‌ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్‌ ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్‌ ఫ్యాన్స్‌ గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను ఇవాళ.. ఇక్కడ ఈ స్టేజిలో ఉన్నానంటే.. నేను ఇంతకు ముందు పని చేసిన టీవీ షోలు కావచ్చు.. సినిమాలు కావచ్చు.. ఇంకా ఏవన్నా కావచ్చు.. అవన్నీ సపోర్టు చేస్తూ.. నాకు ఎప్పుడూ .. వెన్నంటే మేము ఉంటాము.. నువ్వ చేస్తా ఉండన్నా అని చెప్పిన నా కుటుంబసభ్యులైన ఫ్యాన్స్‌కు నా జీవితాంతం రుణపడిపోయి ఉంటాను.

ఏం చేసినా సరే మీ రుణం తీర్చుకోలేను. మంచి సినిమా ఇవ్వొచ్చు..ఇంకా ఏదైనా చేయోచ్చు. ఇంకా ఏదైనా మీట్‌ పెట్టవచ్చు. కలవవచ్చు.. ఏం చేసినా సరే ఈ రుణం ఈ జన్మలో నేను మీకు తీర్చలేను. మీరు ఇచ్చిన లవ్‌ అండ్‌ సపోర్టు. నిన్న ఎవరో అడుగుతున్నారు. నిన్ననే అనుకున్నాం ఫ్యాన్స్‌తో చేద్దాం అని. ఇలా సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నాము ఫ్యాన్స్‌తో అని చెప్పాం. ఏ సాంగ్‌ అని అడిగారు. శాడ్‌ సాంగ్‌ అని చెప్పా. శాడ్‌ సాంగ్‌ ఎందుకండి.. అని అడిగారు. మన బాధలో ఉన్నా వెన్నంటి ఉండి సపోర్టు చేసేది ఫ్యాన్సే అండి అని చెప్పా. మనం ఎలాంటి ఎమోషన్‌లో ఉన్నా సరే.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే..

ప్రతీ ఒక్క నటుడికి ధైర్యం ఇచ్చేది ఫ్యాన్స్‌. అటువంటి కుటుంబం నాకు దొరికినందుకు కృతజ్ఞతలు. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. ఎంతో దూరం నుంచి వచ్చారు. చాలా మందికి పనులు ఉండొచ్చు. అవన్నీ అపుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఓ మనిషిని ఇంతలా ప్రేమించటం.. ఏదీ ఆశించకుండా ఇంత ప్రేమ పొందటం.. తల్లిదండ్రులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఈ ఈవెంట్‌కు మీరే దేవుళ్లు..’’ అంటూ ఎమోషన్‌ అయ్యారు. మరి, సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్‌ అభిమానం గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.