iDreamPost
iDreamPost
ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకే టైంలో సినిమాలు చేయడం అరుదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ దానవీరశూకర్ణకు పోటీగా కృష్ణ తన కురుక్షేత్రంను అదే రోజు విడుదల చేసి దాని తాకిడిని తట్టుకోలేక తీవ్రంగా నష్టపోవడం చరిత్ర అంత సులభంగా మర్చిపోలేదు. గ్యాప్ ఉంటే మంచిదే కానీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేలా రెండేసి తీస్తే మాత్రం దెబ్బ పడటం ఖాయం. ఆ మధ్య రవితేజ, బెల్లకొండ సాయి శ్రీనివాస్ లు వేర్వేరుగా ప్రముఖ స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు కథను సినిమాగా తీయాలని అఫీషియల్ అనౌన్స్ మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. బెల్లం హీరో ఒక అడుగు ముందుకేసి రెండు మూడు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల చేయడం గుర్తే.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సాయి శ్రీనివాస్ తన ప్రాజెక్ట్ డ్రాప్ చేశారని తెలిసింది. రవితేజది ఇంకా ప్రారంభం కానప్పటికీ ఇలా ఒకే స్టోరీతో ఇమేజ్ ఉన్న స్టార్ తో క్లాష్ అయితే లేనిపోని ఇబ్బందులు పోలికలు వస్తాయని అందుకే వద్దనుకుని ఆగిపోయినట్టు సమాచారం. అధికారికంగా ఇంకా చెప్పలేదు కానీ మొత్తానికైతే తీవ్రంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారన్న మాట. ప్రస్తుతం సాయి ఛత్రపతి రీమేక్ లో బిజీగా ఉన్నాడు. టాకీ పార్ట్ ఫినిష్ చేసిన దర్శకుడు వివి వినాయక్ పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాడు. పుష్ప తర్వాత నార్త్ హీరోల సినిమాలకు డిమాండ్ పెరగడంతో యూనిట్ దీని బిజినెస్ మీద చాలా నమ్మకంగా ఉంది.
స్టువర్ట్ పురం బ్యాక్ డ్రాప్ తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. చిరంజీవి 1991లో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ చేస్తే అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అదే సంవత్సరం అదే నెల భానుచందర్ స్టువర్ట్ పురం దొంగలు చేస్తే ఊహించని విధంగా హిట్ అయ్యింది. కట్ చేస్తే ఆ తర్వాత ఎవరూ మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు. దొంగతనాలు నాగేశ్వరరావు వృత్తి అయినప్పటికీ రాబిన్ హుడ్ తరహాలో ఇతనికి పెద్ద హిస్టరీ ఉంది. అందుకే ఇలా పోటీ ప్రయత్నాలు జరిగాయి. వంశీ కృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న టైగర్ నాగేశ్వర్ రావు రెగ్యులర్ షూట్ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర తర్వాత ఉంటుంది
Also Read : Bangarraju : నాగార్జున నమ్మకం బ్రేక్ ఈవెన్ అయ్యేనా