iDreamPost
android-app
ios-app

Swathi Mutyam బెల్లం తమ్ముడు వాయిదా – మరి అన్నయ్య ?

  • Published Aug 03, 2022 | 5:03 PM Updated Updated Aug 03, 2022 | 5:03 PM
  • Published Aug 03, 2022 | 5:03 PMUpdated Aug 03, 2022 | 5:03 PM
Swathi Mutyam బెల్లం తమ్ముడు వాయిదా – మరి అన్నయ్య ?

ఈ నెల 13న విడుదల కావాల్సిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు గణేష్ డెబ్యూ మూవీ స్వాతిముత్యం వాయిదా పడింది. ఉదయం కార్తికేయ 2 ని ఒక రోజు పోస్ట్ పోన్ చేయగానే ఈ నిర్ణయం వెలువడింది. నిజానికి ఈ స్వాతిముత్యంకి సంబంధించిన ప్రమోషన్లు చాలా కాలంగా జరగడం లేదు. అందులోనూ స్వతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసుకుని విపరీతమైన పోటీ నెలకొంది. లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2లతో క్లాష్ అవ్వడం గణేష్ లాంటి కొత్త హీరోకు ఎంత మాత్రం సేఫ్ కాదు. అందులోనూ స్టార్లకే జనం థియేటర్లకు రావడం లేదు. అలాంటప్పుడు తక్కువ బడ్జెట్ తో తీసిన గణేష్ మూవీ కోసం వచ్చే ఛాన్స్ ఉంటుందా. ఎలా చూసినా రిస్కే.

మొత్తానికి తెలివైన స్కెచ్ వేసి స్వాతిముత్యంని తప్పించడం మంచి పనే. భీమ్లా నాయక్, డిజె టిల్లు తర్వాత ఈ ఏడాది సితార బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇదే. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించింది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించగా పెద్ద క్యాస్టింగ్ నే సెట్ చేసుకున్నారు. బహుశా సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి వాయిదా పడొచ్చు. ఇదిలా ఉండగా అన్నయ్య చేస్తున్న ఛత్రపతి రీమేక్ తాలూకు అప్డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఆగిందో లేక ఆపేశారో దర్శకుడు వివి వినాయక్ సైతం చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. చాలా మటుకు టాకీ పార్ట్ పూర్తయిందన్నారు కానీ ఆ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు లేదు.

అల్లుడు అదుర్స్ తర్వాత కనిపించకుండా పోయిన సాయి శ్రీనివాస్ తిరిగి ఛత్రపతి డబ్బింగ్ వెర్షన్ తోనే తెలుగు ఆడియన్స్ కి కనిపిస్తాడని చెప్పారు. దాని తర్వాత మొదలుపెట్టిన స్టువర్ట్ పురం దొంగని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఏ కొత్త ప్రాజెక్టు సైన్ చేయలేదు. దర్శకులెవరూ ఖాళీగా కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అతనేం చేయబోతున్నాడో చూడాలి. లుక్స్ పరంగా బాగానే కనిపిస్తున్న గణేష్ కి స్వాతిముత్యం ఎలాంటి బ్రేక్ ఇస్తుందో. అన్నయ్య లాగా గ్రాండ్ సెటప్ తో ఎంట్రీ ఇవ్వడం లేదు. అనవసర హంగుల జోలికి నో అనేశాడు. సింపుల్ బడ్జెట్ తో లవ్ ఎంటర్ టైనర్ అయినా ఈ కుర్రాడికి పెద్ద బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş