iDreamPost
android-app
ios-app

రాష్ట్రం కష్టాల్లో ఉంది .. ఉదారంగా ఆదుకోండి

రాష్ట్రం కష్టాల్లో ఉంది .. ఉదారంగా ఆదుకోండి

ఆర్ధిక కష్టాల నుంచి గట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఒక్కటే ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని భావిస్తోంది. అందుకే ఉదారంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర పాలకులు కేంద్ర పెద్దలకు వీలైనప్పుడల్లా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 15 వ ఆర్ధిక సంఘానికి నిధుల సిఫార్సు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నివేదిక పంపింది.

విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఉదారంగా నిధుల మంజూరుకు సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో రూ.2,19,695 కోట్లను గ్రాంట్ల రూపంలో అందేలా చూడాలని కోరింది.

గత ప్రభుత్వం భారీగా పెండింగ్‌ బిల్లులను వదిలిపెట్టడాన్ని, అదే సమయంలో బడ్జెట్‌కు బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేయడాన్ని నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చేలా సిఫారసు చేయాలని నివేదికలో జగన్ సర్కార్ కోరింది.