iDreamPost
android-app
ios-app

అరుదైన ఘనతకు దగ్గరలో RRR హీరోలు

  • Published Jan 05, 2023 | 2:50 PM Updated Updated Jan 05, 2023 | 2:50 PM
  • Published Jan 05, 2023 | 2:50 PMUpdated Jan 05, 2023 | 2:50 PM
అరుదైన ఘనతకు దగ్గరలో RRR హీరోలు

రాజమౌళి వెండితెర అద్భుతం ఆర్ఆర్ఆర్ రిలీజై తొమ్మిది నెలలు కావొస్తున్నా దాని తాలూకు ఘనతలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ జక్కన్న న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ ప్రధానం చేసిన బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకున్న వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణతో అక్కడికి విచ్చేసిన అతిధుల్లోకెల్లా ఎంతో ప్రత్యేకంగా కనిపించిన ఈ దర్శక మహేంద్రజాలికుడు మాటలతోనూ అదే కనికట్టు చేశారు. చాలా ఉద్వేగంగా ఫీలవుతున్నానని అయితే ఆ భయాన్ని కప్పేసిన నా దుస్తుల డిజైనర్ కు థాంక్స్ చెబుతున్నానని చెప్పి అందరిని నవ్వించారు. ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ థాంక్స్ చెప్పారు

ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డులను అంచనాలను వేయడంలో ప్రపంచవ్యాప్త మీడియా సంస్థలు ప్రామాణికంగా తీసుకునే వెరైటీ విడుదల చేసిన ముందస్తు ప్రిడిక్షన్ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల పేర్లు ఉండటం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నిజానికి టాప్ 10లో తారక్ ఒకరే ఈ జాబితాలో ఉన్నట్టుగా ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటే యంగ్ టైగర్ కి పదో స్థానం వస్తోంది. అలా కాకుండా సదరు పత్రిక ప్రాధాన్యత క్రమంలో ఇచ్చిన ప్రకారం చూసుకుంటే తారక్ చరణ్ ఇద్దరూ 19, 20 ర్యాంకుల్లో ఉన్నారు. అంటే అసలైన వేడుక వద్ద విజేతగా నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్టే.

అయినా కూడా ఇది తీసేయదగ్గ చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ఇండియన్ యాక్టర్ ఇలా టాప్ టెన్ ప్రాపబుల్స్ లో చోటు దక్కించుకోలేదు. ఇంతకన్నా గొప్ప సినిమాలు అద్భుతమైన నటనలు వచ్చిన సందర్భాల్లోనూ ఆస్కార్ గడప దాకా వెళ్లి వెనక్కు వచ్చినవి ఉన్నాయి కానీ ఈ స్థాయిలో గుర్తింపు వచ్చినవి లేదు. ఆర్ఆర్ఆర్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే ఈ నెల 9న లాస్ ఏంజెల్స్ ఐమ్యాక్స్ లో జరగబోయే స్పెషల్ ప్రీమియర్ కు టికెట్ అమ్మకాలు చేస్తే కేవలం నిమిషంన్నర లోపే 932 టికెట్లు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టే ట్రిపులర్ గ్లోబల్ రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో రెండు మూడు నెలల దాకా ఇదిలాగే కొనసాగుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş