iDreamPost
android-app
ios-app

హైకోర్టు న్యాయమూర్తిగా మహాకవి శ్రీ శ్రీ కూతురు!

హైకోర్టు న్యాయమూర్తిగా మహాకవి శ్రీ శ్రీ కూతురు!

ప్రముఖ తెలుగు విప్లవ కవి శ్రీ శ్రీ కూతురు నిడమోలు మాలా ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది మార్చీలో ఆమె అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఆమెకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆమెను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆమెతో పాటు జస్టిస్ ఏఏ నక్కీరన్‌, జస్టిస్ ఎస్‌ సుందర్‌, జస్టిస్ సుందర్‌మోహన్‌, జస్టిస్ కబాలి కుమారేశ్‌బాబులు కూడా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కాగా, మహాకవి శ్రీశ్రీ-సరోజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. శ్రీశ్రీ చిన్న కుమార్తె మాలా. ఈమె మద్రాస్‌ లా కాలేజీ నుంచి లా కోర్సులో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 32 ఏళ్ల పాటు మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2020లో పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు.

ఇక, మాలా భర్త నిడుమోలు రాధా రమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. మాలా-రాధా రమణ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ జయ ప్రకాశ్‌ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. మరి, శ్రీశ్రీ కూతురు మాలా మద్రాస్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.