SNP
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో మ్యాచ్‌లు ఊహకు అందకుండా సాగుతున్నాయి. అద్భుతంగా సాగుతున్న బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలుతోంది. బాగా బౌలింగ్ వేస్తున్న బౌలర్లు తర్వాతి ఓవర్లలో పరుగులు ఇస్తున్నారు. ముందు పరుగులు ఇచ్చి బౌలర్లే మళ్లీ వికెట్ల పంట పండిస్తున్నారు. ఇలా భారీ ట్విస్ట్‌లతో వరల్డ్ కప్ అంచనాలుకు మించి సాగుతోంది. ఇప్పటికే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో ముందు బాగా ఆడిన పాక్.. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత కుప్పకూలింది. సేమ్ అలాంటి మ్యాచ్ మళ్లీ సోమవారం జరుగుతున్నట్లు అనిపించింది. 125 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని శ్రీలంక.. 209 పరుగులకు ఆలౌట్ అవ్వడం క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురిచేసింది.
లక్నో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ స్టార్ట్ అందుకున్న శ్రీలంక.. 100కు పైగా పరుగులను వికెట్లు కోల్పోకుండా చేసింది. దీంతో లంక 300లకు పైగా రన్స్ చేస్తుందని అంతా అనుకున్నారు. ఓపెనర్లు నిస్సంకా, కుసల్ పెరెరా హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేశాడు. అప్పటికే రెండు మ్యాచ్‌లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో ఉన్న ఆస్ట్రేలియకు వరుసగా మూడో ఓటమి కూడా తప్పదనిపించింది. కానీ, అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు.. లంక బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్‌కు పంపుతూ.. 209 పరుగులకు వారిని ఆలౌట్ చేశారు.
సరిగ్గా 125 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక.. మరో 84 పరుగులు మాత్రమే చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది. నిస్సంకా 61, పెరెరా 78 తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. అసలంకా 25 పరుగులతో పర్వాలేదనిపించినా.. లంకకు దొరికి స్టార్ట్‌కు ఇంకా బాగా ఆడాల్సింది. వీళ్లు ముగ్గురు మినహాయించి.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీసుకోగా.. స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో సత్తా చాటాడు. మరి 125 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయి 209 పరుగులకే లంక ఆలౌట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sri Lanka 157 for 1 from 26.1 overs.
Sri Lanka 209 for 10 from 43.3 overs.
– Australia got 9 wickets for just 52 runs with Zampa taking 4 wickets, What a comeback…!!!!! pic.twitter.com/YSMz3LNqIE
— Johns. (@CricCrazyJohns) October 16, 2023
ఇదీ చదవండి: VIDEO: ఇంగ్లండ్‌పై విజయం! ముజీబ్‌ను హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి