iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణలు

  • Published Dec 17, 2020 | 9:46 AM Updated Updated Dec 17, 2020 | 9:46 AM
బిగ్ బాస్ ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణలు

బిగ్ బాస్ 4 వంద ఎపిసోడ్లు ఎలా జరిగాయి, రేటింగులు, పాజిటివ్ నెగటివ్ లు పక్కనపెడితే ఇప్పుడు అందరి దృష్టి రాబోయే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మీదే ఉంది. స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారనే క్లారిటీ ఇంకా రాకపోయినా పలు చర్చల అనంతరం మెగాస్టార్ చిరంజీవి వచ్చేందుకు ఓకే చెప్పినట్టు ఫ్రెష్ అప్ డేట్. అది కూడా ఆచార్య షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిరు ఫ్రీ టైంని బట్టే అన్నపూర్ణ స్టూడియోలో షూట్ ని ప్లాన్ చేస్తారట. ఈ వ్యవహారంలో నాగార్జునదే కీలక పాత్రట. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులను కూడా ట్రై చేసినట్టు టాక్ వచ్చింది కానీ ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు. తారక్ ఏమో కానీ మహేష్ అయితే అసలే రాడు.

ఇక దీంతో పాటు చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. అందులో మెహ్రీన్, లక్ష్మి రాయ్ ల డాన్స్ పెర్ఫార్మన్స్ లతో పాటు ఓ ఇద్దరు యువ హీరోల హంగామా కూడా ఉంటుందట. ఇవి కాకుండా జబర్దస్త్ టీమ్ తో కొన్ని స్కిట్స్ కూడా సిద్ధం చేసినట్టు వినికిడి. మెగా మారథాన్ ఎపిసోడ్ తరహాలో మూడు లేదా నాలుగు గంటల పాటు ప్రోగ్రాం నడిచేలా నిర్వాహకులు ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మళ్ళీ వచ్చే ఏడాది దాకా గ్యాప్ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ 5కి హైప్ రావాలంటే ఇప్పుడు ముగింపు ఎలా చేస్తారన్నది చాలా ముఖ్యం. అందుకే స్టార్ మా ఛానల్ అన్ని వనరులు వాడుకునేందుకు సిద్ధమవుతోంది.

నిజానికి బిగ్ బాస్ 4 గత మూడు సీజన్ల తరహాలో అద్భుతాలు చేయలేదు. ముఖ్యంగా వీక్ డేస్ లో నడిచిన తీరు పట్ల సోషల్ మీడియాతో పాటు జెనరల్ పబ్లిక్ లోనూ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సీరియల్స్, ఐపిఎల్ కు పోటీ ఇవ్వలేక చాలాసార్లు చేతులెత్తేసింది. నాగార్జున శనివారం ఆదివారం నిలబెడుతూ వచ్చారు కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. సమంతా ఎంట్రీ కూడా ప్లస్ అయ్యింది. ఇప్పుడీ ఫైనల్ షూటింగ్ రేపే చేస్తారా లేక శనివారం ఉదయం మొదలుపెట్టి ఏకధాటిగా ఫినిష్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అభిజిత్ అఖిల్ సొహైల్ మధ్యే పోటీ కనిపిస్తోంది. అరియనా, హారికలలో ఒకరు రన్నరవుతారని టాక్.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet