iDreamPost
android-app
ios-app

ఇంకా ఆలస్యం కానున్న క్రేజీ రీమేక్

  • Published Jun 08, 2021 | 11:03 AM Updated Updated Jun 08, 2021 | 11:03 AM
  • Published Jun 08, 2021 | 11:03 AMUpdated Jun 08, 2021 | 11:03 AM
ఇంకా ఆలస్యం కానున్న క్రేజీ రీమేక్

నాన్న నాగార్జున కెరీర్ మొదలుపెట్టిన ఐదేళ్లకే శివతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా కొడుకు నాగ చైతన్య మాత్రం కాస్త ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. అమీర్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందుతున్న లాల్ సింగ్ చద్దాలో చైతు ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఇది విజయ్ సేతుపతితో ప్లాన్ చేశారు. అయితే డేట్ల సమస్య రావడంతో అతను ఇష్టం లేకపోయినా తప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలతో ఆల్రెడీ చేసేసిన సేతుపతికి అమీర్ ఖాన్ తో నటించే అవకాశం దక్కడం పట్ల ఫ్యాన్స్ కూడా చాలా సంతోష పడ్డారు. అయితే అది ఎక్కువ రోజులు నిలవలేదు. మళ్ళీ సాధ్యమవుతుందన్న గ్యారెంటీ లేదు.

ఇదిలా ఉండగా లాల్ సింగ్ చద్దా షూటింగ్ కి కాస్త పెద్ద బ్రేక్ పడినట్టు ముంబై మీడియా టాక్. కరోనా సెకండ్ వేవ్ తో పాటు యూనిట్ కు సంబంధించిన ఏవో అంతర్గత కారణాల వల్ల తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టినట్టు వినికిడి. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో చెప్పిన మాట మీద కట్టుబడటం సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే మళ్ళీ 2022 వేసవికి పోస్ట్ పోన్ అవుతుంది. కల్ట్ క్లాసిక్ హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్యకు కాశ్మీర్ లో యుద్ధం చేసే ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్లో చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారట.

దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. కరీనా కపూర్ ఇందులో అమీర్ సరసన జోడిగా నటిస్తోంది. చైతు పక్కన ఎవరైనా జోడి ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే ఇటలీలో థాంక్ యు సినిమా సుదీర్ఘమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చిన చైతు గత కొంత కాలంలో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. సమంతా ఫ్యామిలీ మ్యాన్ 2 కి సూపర్ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ ట్రైలర్ టైంలో ట్వీట్ చేయడం తప్ప ఆ తర్వాత సిరీస్ రిలీజ్ అయ్యాక కనీసం వీడియోలో కూడా స్పందించలేదు. మరి అంతగా అందుబాటులో లేనంత బిజీగా చైతు ఏం చేస్తున్నట్టో

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio