iDreamPost
android-app
ios-app

Sita Ramam రణరంగంలో సీతారామం ప్రేమకథ

  • Published Jul 25, 2022 | 2:04 PM Updated Updated Dec 06, 2023 | 6:31 PM

ఇందాక ప్రసాద్ ఐమ్యాక్స్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న ఓ కీలక పాత్ర చేసింది.

ఇందాక ప్రసాద్ ఐమ్యాక్స్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న ఓ కీలక పాత్ర చేసింది.

Sita Ramam రణరంగంలో సీతారామం ప్రేమకథ

తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తే వదలకుండా చేస్తున్న దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా సీతారామం. మహానటి నిర్మించిన ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ నిర్మించిన ఈ భారీ చిత్రం వచ్చే నెల 5న విడుదల కాబోతోంది. ఇందాక ప్రసాద్ ఐమ్యాక్స్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న ఓ కీలక పాత్ర చేసింది. ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకుని ఇటీవలే మళ్ళీ కనిపిస్తున్న సుమంత్ కూడా ఓ ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ట్రైలర్లోనే కథ గుట్టుని విప్పేశారు.
Sita Ramam A love story of Sita Ramam in the battlefield
అఫ్రీన్(రష్మిక మందన్న)కి ఒక లేఖను సీతామాలక్మి(మృణాల్ ఠాకూర్)కి అందజేయాల్సిన బాధ్యత పడుతుంది. దాని కోసం ఆమె వెతకని ప్రదేశం ఉండదు. దేశదేశాలు చుట్టేసి వచ్చినా జాడ దొరకదు. ఆర్మీలో పని చేసే లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్)కు సీతకు పరిచయం ఎక్కడ ఎలా మొదలయిందనే ఆరాలు తీయడం మొదలుపెడుతుంది. అయితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం సవాల్ గా మారుతుంది. ఆర్మీ అధికారులు కూడా సహకరించరు. దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. అసలు రామ్ ఏమయ్యాడు, వీళ్ళ ప్రేమకథ ఏ తీరానికి చేరుకుంది, అఫ్రీన్ విజయవంతంగా ఆ లేఖను ఇచ్చిందా లేదా అనేదే మెయిన్ పాయింట్

ఇది వర్తమానంలో జరిగే కథ కాదు. దశాబ్దాల వెనుకటి నేపధ్యాన్ని తీసుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ప్రతి ఫ్రేమ్ లో భావుకత ఉట్టిపడుతోంది. దుల్కర్, మృణాల్ జోడి అందంగా ఉంది. రష్మిక తన రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, సచిన్ కెడ్కర్, గౌతమ్ మీనన్ తదితరులు ఉన్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీలా అనిపిస్తున్నప్పటికీ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న వార్ డ్రామాని కూడా జొప్పించారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ లో సినిమాలు రావడం అరుదు. కొన్ని వారాలుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న టాలీవుడ్ కు సీతారామంలు ఎలాంటి ఊపిరినిస్తారో చూడాలి.