iDreamPost
android-app
ios-app

చిలిపి దొంగ కలెక్షన్లు – సేఫా కాదా

  • Published Aug 24, 2021 | 5:34 AM Updated Updated Aug 24, 2021 | 5:34 AM
చిలిపి దొంగ కలెక్షన్లు – సేఫా కాదా

ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తో డీసెంట్ ఎంటర్ టైనర్ గా ఆడుతున్న రాజరాజ చోర మొదటి నాలుగు రోజులు బాగానే రాబట్టుకున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. నిర్మాణ సంస్థ స్వంతంగా చేసుకున్న రిలీజ్ కావడంతో ఎంత బిజినెస్ జరిగిందనే వివరాలు బయటికి రాలేదు కానీ పెట్టుబడికి తగ్గట్టు బ్రేక్ ఈవెన్ అయ్యిందని మాత్రం చెబుతున్నారు. భారీ చిత్రం కాకపోవడం వల్ల ఓపెనింగ్స్ మైండ్ బ్లోయింగ్ అనే స్థాయిలో లేకపోయినా టాక్ కు తగ్గట్టు వీకెండ్ లో చాలా చోట్ల మంచి ఫుల్స్ నమోదయ్యాయి. శ్రీవిష్ణు మార్కెట్ కు తగ్గట్టు కలెక్షన్లు వచ్చాయని మాత్రం అర్థమవుతోంది. అయితే బ్లాక్ బస్టర్ అనొచ్చా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం

ట్రేడ్ నుంచి అనధికారికంగా అందిన సమాచారం మేరకు రాజరాజ చోర సుమారు 3 కోట్ల 34 లక్షల దాకా షేర్ రాబట్టుకుంది. గ్రాస్ ప్రకారం చూసుకుంటే ఇది 5 కోట్ల 80 లక్షలు అవుతుంది. ఏపిలో థియేటర్లకు ఉన్న నిబంధనల్లోనూ ఇంత మొత్తం రావడం అంటే విశేషం. తెలంగాణాలో మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో అక్కడ బాక్సాఫిస్ ఫిగర్స్ బాగున్నాయి. అయితే ఎస్ఆర్ కల్యాణ మండపంని దాటే ఛాన్స్ మాత్రం లేనట్టే. సుమారు 8 కోట్ల షేర్ తో సెకండ్ లాక్ డౌన్ సూపర్ హిట్ గా కొనసాగుతున్న ఆ మూవీని క్రాస్ చేయాలంటే రాజరాజ చోర ఇంకో వారంపైనే స్ట్రాంగ్ గా రన్ అవ్వాలి.కానీ అది కష్టమే. ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజామ్ – 1 కోటి 29 లక్షలు
సీడెడ్ – 38 లక్షలు
ఉత్తరాంధ్ర – 32 లక్షలు
ఈస్ట్ గోదావరి – 19 లక్షలు
వెస్ట్ గోదావరి – 13 లక్షలు
గుంటూరు – 24 లక్షలు
కృష్ణా – 14 లక్షలు
నెల్లూరు – 10 లక్షలు

ఏపి/తెలంగాణ మొత్తం నాలుగు రోజుల షేర్ – 2 కోట్ల 79 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 8 లక్షలు
ఓవర్సిస్ – 47 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల షేర్ – 3 కోట్ల 34 లక్షలు

సో రాజరాజ చోర చేసుకున్న బిజినెస్ కి రెండున్నర కోట్లు మాత్రమే బ్రేక్ ఈవెన్ గా చెబుతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటికే కోటి దాకా లాభం వచ్చినట్టు. ఈ శుక్రవారం శ్రీదేవి సోడా సెంటర్, ఇచట వాహనములు నిలుపరాదు, హౌస్ అరెస్ట్ సినిమాలు రిలీజవుతున్నాయి కాబట్టి వాటికి వచ్చే టాక్ ని బట్టి రాజరాజ చోర స్లో అవుతుందా లేదా స్టడీగా కొనసాగుతుందా అనే దాని గురించి క్లారిటీ వస్తుంది. ఒకవేళ థియేట్రికల్ బిజినెస్ కనక ఎక్కువ జరిగి ఉంటే రాజరాజ చోర సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. మరీ బెస్ట్ ఎంటర్ టైనర్ కాకపోవడం కూడా కొంత ప్రభావం చూపిస్తోంది. వీక్ డేస్ లో జోరు బాగా తగ్గిపోయింది. టీమ్ ప్రమోషన్ టూర్లు చేస్తోంది కానీ అదెంత వరకు ఉపయోగపడుతుందో ఈ వారాంతంలో తేలిపోతుంది

Also Read : లవ్ స్టోరీ ముందు గట్టి చిక్కులు