iDreamPost
android-app
ios-app

Shruti Haasan : ముందు శ్రుతి హాసనే ప్రపోజ్ చేసిందట.. ఓపెన్ అయినట్టేనా?

Shruti Haasan : ముందు శ్రుతి హాసనే ప్రపోజ్ చేసిందట.. ఓపెన్ అయినట్టేనా?

కమల్ హాసన్ కుమార్తె గా సినీరంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది.. తండ్రి రికమండేషన్ తో సినిమాలు దక్కించుకునే స్థాయి నుంచి తన టాలెంట్ తో సినిమాలు దక్కించుకునే స్థాయికి వెళ్లింది. అయితే ఒక ఫారెన్ సింగర్ తో ప్రేమలో పడిన ఆమె ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. విదేశాల నుంచి ఆయనని రప్పించి తల్లి తండ్రికి పరిచయం చేయడంతో ఇక వీరిద్దరి వివాహం కూడా ఖాయం అని అందరూ భావించారు.. అయితే అనూహ్య పరిస్థితుల్లో వీరిద్దరూ విడిపోయారు.

ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది శృతి హాసన్.. చాలా కాలం పాటు సినిమాలకు కూడా దూరంగా ఉన్న ఆమెకు మళ్లీ క్రాక్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో తాను మరొక వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగానే ప్రకటించింది శృతిహాసన్. శంతను హజారికా అనే ఒక డూడుల్ ఆర్టిస్ట్ శృతి హాసన్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు కనిపించాడు.

అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు ఇప్పటి వరకు అధికారికంగా అయితే వెల్లడించలేదు. కానీ తాజాగా శృతి హాసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియోలో అతనికి మొదట ప్రపోజ్ చేసింది తానేనని వెల్లడించింది. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ క్విజ్ లు కొన్ని ఉంటాయి. జంటగా ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు ముందు ఏ పని చేశారు అనే విషయాన్ని చెప్పే విధంగా ఈ క్విజ్లు రూపొందించబడ్డాయి. అలాంటి ఒక క్విజ్ లో భాగంగా శృతి హాసన్ తాను మొదటగా అతనికి ప్రపోజ్ చేశా అనే విషయాన్ని వెల్లడించింది. అన్నట్టు శంతనుని కూడా తండ్రి కమల్ హాసన్ కి పరిచయం చేసింది శృతి హాసన్. మరి ఇతనితో అయినా ఏడడుగులు వేసిన లేదో వేచి చూడాలి మరి.

Also Read : Sankranthi 2022 Releases : పండగ సినిమాల పోటీలో కొత్త ట్విస్ట్

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio