iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 6 పార్టిసిపెంట్స్ వీళ్లేనా?

  • Published Aug 17, 2022 | 5:38 PM Updated Updated Aug 17, 2022 | 5:38 PM
  • Published Aug 17, 2022 | 5:38 PMUpdated Aug 17, 2022 | 5:38 PM
బిగ్ బాస్ 6 పార్టిసిపెంట్స్ వీళ్లేనా?

వచ్చే నెల 4వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 6 మొదలుకానుంది. ఆ మధ్య చేసిన ఓటిటి షో ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తిరిగి మళ్ళీ శాటిలైట్ రూటు తీసుకుంది. వివాదాలే కేంద్రంగా నడిచే ఈ షో హిందీ, తమిళ భాషల్లోలా ఇక్కడ పెద్ద సక్సెస్ కాని మాట వాస్తవం. అలా అని క్రేజ్ లేదని కాదు కానీ వాటితో పోల్చుకుంటే మన రీచ్ తక్కువే. జూనియర్ ఎన్టీఆర్, నానిలు తొలి రెండు సీజన్లు డీల్ చేశాక వదిలేసుకోవడం, సరైన గేమ్స్ స్కిట్స్ లేకపోవడంతో పాటు పార్టిసిపెంట్స్ కు సంబంధించిన ఎంపిక కూడా ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు అసంతృప్తిని కలగజేస్తూ వచ్చింది. అయినప్పటికీ ఆదరణ విషయంలో ఇతర ప్రోగ్రాంస్ తో గట్టి పోటీనే ఇస్తూ వచ్చింది.

ఇక ఇప్పుడీ బిగ్ బాస్ 6 ఎవరు ఉంటారనే లీక్స్ మెల్లగా బయటికి వస్తున్నాయి. హాస్య నటుడు చలాకి చంటి, యాంకర్ నేహా, గతంలో ఈ షోకి రివ్యూస్ ఇచ్చి పాపులర్ అయిన ఆది రెడ్డి, గాయని మోహన, ఆర్జె సూర్య అలియాస్ కొండబాబు, నటి సుదీప, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, యాక్ట్రెస్ ఇనయా సుల్తానా, యుట్యూబ్ ఫేమ్ శ్రీహన్, ట్రాన్స్ జెండర్ తన్మయ్, నటి శ్రీసత్య, నటుడు అర్జున్ కళ్యాణ్ పేర్లు ఇప్పటిదాకా వినిపించిన వాటిలో ఉన్నాయి. చివరి నిమిషంలో కొన్ని మార్పులు ఉండొచ్చు. ఇంకో ఇద్దరూ లేదా ముగ్గురు తోడొవచ్చు కూడా. ఈసారి గేమ్ ని మరింత స్పైసీగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేశారట. అందులో భాగంనే ఈ ఎంపిక కూడా జరిగిందని ఇన్ సైడ్ టాక్.

కాకపోతే ఇక్కడ గొప్పగా చెప్పుకునే సెలబ్రిటీలు ఎవరూ లేకపోవడం అసలు ట్విస్టు. పేరున్న వాళ్ళను తీసుకొచ్చినా అద్భుతాలేమి జరగడం లేదు కాబట్టి ఇలాంటి సభ్యుల ద్వారా మంచి మాస్ మసాలాని జోడించేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 4న గ్రాండ్ లాంచింగ్ జరగనుంది. ఎప్పటిలాగే వంద రోజులకు పైగా హౌస్ లో వీళ్ళను బందించేస్తారు. ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డు ఎంట్రీలు వగైరా ఎప్పటిలాగే ఉంటాయి. అయితే ప్రతి సీజన్ కు పెరగాల్సిన టిఆర్పి రేటింగ్ క్రమంగా కొంత తగ్గుముఖం పట్టడంతో నిర్వాహకులు ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. అదెంత వరకు నిజమో బిగ్ బాస్ 6 మొదలైతే కానీ తెలియదు. నాగార్జునతో చేసిన ప్రోమోలు ఆల్రెడీ పబ్లిసిటీ షురూ చేశాయి

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş