iDreamPost
android-app
ios-app

తెలుగు సినిమాల మీదే అతని కన్ను

  • Published Jun 24, 2020 | 8:58 AM Updated Updated Jun 24, 2020 | 8:58 AM
  • Published Jun 24, 2020 | 8:58 AMUpdated Jun 24, 2020 | 8:58 AM
తెలుగు సినిమాల మీదే అతని కన్ను

ఏ ముహూర్తంలో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి చూసి దాని రీమేక్ కి ఒప్పుకున్నాడో ఇక అప్పటి నుంచి తెలుగు సినిమాల మీదే మనసు పారేసుకుంటున్నాడు. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఎవరూ ఊహించనిది. దీంతో ఇతగాడి డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తాజాగా గత ఏడాది నాని చేసిన ఎమోషనల్ మేజిక్ జెర్సీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. మళ్లీ ఎప్పుడు కొనసాగిస్తారనేది అంతు చిక్కడం లేదు. ఒరిజినల్ వర్షన్ తీసిన గౌతమ్ తిన్ననూరినే దీనికీ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇదిలా ఉండగా షాహిద్ కపూర్ మరో సౌత్ సినిమా మీద కన్నేశాడు. అదే సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ బయోపిక్ గా ఇది రూపొందింది. ఫస్ట్ కాపీ సిద్ధమైపోయి రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో వైరస్ వల్ల థియేటర్ల గడప తొక్కకుండానే ఆగిపోయింది. ఇప్పుడీ సినిమాని హిందీలో తాను చేయాలని నిర్ణయించుకున్నట్టు తాజా అప్ డేట్. దర్శకురాలు సుధా కొంగర దీన్ని తెరకెక్కించిన తీరు బాగా నచ్చడంతో పాటు విడుదలయ్యాక మంచి స్పందన దక్కించుకుంటుందని తన వాళ్ళతో చెబుతున్నాడట. అయితే డైరెక్టర్ మారే అవకాశం ఉంది. సుధా కొంగర దీని తర్వాత విజయ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే షాహిద్ వేరేవాళ్ళ మీద ఆధారపడాల్సిందే.

కబీర్ సింగ్, జెర్సీ రెండూ ఇక్కడ తీసిన దర్శకులు టేకప్ చేశారు. దీనికీ అలాగే జరగాలని షాహిద్ కోరుకుంటున్నాడు. మరి సుధా కొంగరకు కనక విజయ్ ప్రాజెక్ట్ మిస్ అయితే అప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ఇదంతా ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. ఆకాశం నీ హద్దురా రూపొందింది తమిళంలోనే అయినా షాహిద్ కపూర్ ని ఇలా ఆలోచించేలా ప్రేరేపించింది మాత్రం తెలుగు సినిమాలే. అందుకే ఆ క్రెడిట్ టాలీవుడ్ కే దక్కుతుంది. ఒకదశలో అల వైకుంఠపురములో మీద కూడా షాహిద్ కన్నేశాడని టాక్ వచ్చింది కానీ దాని హక్కులు కొన్న నిర్మాతలు వేరే ఆప్షన్ల వైపు చూస్తుండటంతో ఆ ఛాన్స్ లేనట్టే. ఇక ఆకాశం నీ హద్దురా ఓటిటిలో విడుదల చేయొచ్చనే టాక్ చెన్నై సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది కానీ సూర్య ఈ విషయంగా మౌనంగానే ఉన్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss