iDreamPost
iDreamPost
లాల్ సింగ్ చద్దా ను బాయ్ కాట్ చేసిన కొందరు నెటిజెన్స్ .ఇప్పుడు మరికొన్ని భారీ బాలీవుడ్ సినిమాలపై పడ్డారు. వచ్చే జనవరిలో వచ్చే పఠాన్ ఇప్పటి నుంచే బాయికాట్ చేయమని పోస్టులు చేస్తున్నారు. లాల్ సింగ్ బాగుందని అన్నందుకే హృతిక్ రోషన్ సినిమా, విక్రమ్ వేదను బహిష్కరించమంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఏకంగా బాలీవుడ్ బాయికాట్ (Boycott Bollywood) వంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ , ఇతర సూపర్ స్టార్లపై నెటిజన్లు ఎందుకింత ఆగ్రహం?
బాలీవుడ్ బాయ్ కాట్ (Boycott Bollywood)
బంధుప్రీతి, సెలబ్రిటీల ప్రకటనలు, వారి యాటిట్యూడ్ వరకు నెటిజన్లకు బాలీవుడ్‌లో ఏదీ నచ్చడంలేదు. దానికి చాలా కారణాలున్నాయి. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానే #Boycott సోషల్ మీడియాలో ట్రెండింగ్ ప్రారంభమవుతుంది. ఇంతకుముందూ ఈ రగడ ఉండేదికాని, ఈయేడాది చాలా చాలా రెగ్యులర్‌గా మారింది. చాలా సినిమాలమీద నెటిజన్లు కోపాన్ని చూపిస్తున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేవరకు వదిలిపెట్టడడంలేదు. ఇదేదో ఒక పనిలా పెట్టుకున్నారు. కొందరికి బాయ్ కాట్ అన్నది ఫన్. ఒక సినిమా తర్వాత మరోసినిమా. ఇలా బాలీవుడ్ మీదే పగబట్టారు,
లాల్ సింగ్ చద్దా
ఈయేడాది సోషల్ మీడియా చాలా నెగిటీవ్ గా రియాక్ట్ అయిన సినిమా అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా. కొన్నేళ్ల క్రితం అమీర్, కరీనా చెప్పిన మాటలను పట్టుకొని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. సినిమాను బాయ్ కాట్ చేయమని విపరీతంగా పోస్ట్ లు పెట్టారు. ఈ దెబ్బకు లాల్ సింగ్ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాలేదు. అంతెందుకు అడ్వాన్డ్ బుకింగ్స్ చాలా పూర్ గా వచ్చాయి. దీనికి కారణం #BoycottLaalSinghChaddha ధోరణి అని బాలీవుడ్ ట్రేడ్ నమ్ముతోంది.
పఠాన్
రెండురోజుల నుంచి #BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అభిమానితో షారూఖ్ ఖాన్ ప్రవర్తన తీరు నుంచి, 2020లో దీపికా పదుకొనే JNU విద్యార్ధులకు సంఘీభావం తెలపడం, పఠాన్ మార్ఫింగ్ పోస్టర్ వరకు చాలా విషయాలమీద ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఫ్యాన్స్ ను షారూఖ్ రెగ్యులర్ గా కలుస్తాడు. అతని ఇంటిముందు రోజూ అతని అభిమానులు వస్తారు. వాళ్లకు వీలైనప్పుడల్లా కనిపించడం SRK అలవాటు. అలాంటి హీరోను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక JNU విద్యార్ధులకు దీపిక సపోర్ట్ నివ్వడం కొన్ని రాజకీయ పార్టీలకు, వాళ్ల అభిమానులు నచ్చలేదు. రాజకీయ కారణాలతో ఇప్పుడు పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయమని సోషల్ మీడియాలో గోలమొదలైంది.
విక్రమ్ వేద
హృతిక్ రోషన్ అంటే బాలీవుడ్ బాగా ఇష్టం. కాని ఆయన చేసిన తప్పు ఏంటంటే? ఇటీవల లాల్ సింగ్ చద్దాను చూసి, అమీర్ ఖాన్ ను ప్రశంసించాడు. అంతే నెటిజన్లకు హృతిక్ మీద కోపమొచ్చింది. అందుకే #BoycottVikramVedha సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
బ్రహ్మాస్త్ర
రణబీర్ కపూర్ , అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర 9 సెప్టెంబర్ 2022న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి #BoycottBrahmastra ట్రెండింగ్‌లో ప్రారంభమైంది. ‘నేపో కిడ్స్’ అంటూ స్టార్ కిడ్స్ సినిమాలను చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపకపోవడమే దీనికి పెద్ద కారణం. ఇంకో రీజన్ కూడా వాళ్లు చెబుతున్నారు. రణబీర్ బూట్లతో ఆలయంలోకి ప్రవేశించిన సన్నివేశంతో వాళ్లు బాగా బాధపడ్డారంట. అందుకే ఇప్పటి నుంచే ట్రోలింగ్, బాయికాట్ ప్రచారం, నెగిటీవ్ గా కామెంట్స్ చేయడం.