iDreamPost
android-app
ios-app

Senapathi Report : సేనాపతి రిపోర్ట్

  • Published Jan 01, 2022 | 6:34 AM Updated Updated Jan 01, 2022 | 6:34 AM
Senapathi Report : సేనాపతి రిపోర్ట్

నిన్న థియేటర్ రిలీజ్ అందుకున్న అర్జున ఫల్గుణతో పాటుగా ఓటిటిలో విడుదలైన కొత్త సినిమా సేనాపతి ఆహాలో అందుబాటులోకి వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా కొద్దిరోజుల క్రితం వచ్చిన ట్రైలర్ మంచి ఆసక్తిని రేపింది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ డ్రామాను ఆహా టీమ్ గట్టిగానే ప్రమోట్ చేసింది. ఇటీవలి కాలంలో తమ ప్లాట్ ఫార్మ్ కోసం స్వంతంగా సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసుకున్న ఆహా దానికి తగ్గట్టుగానే క్వాలిటీ టీమ్ తో ఇలాంటి ప్రాజెక్టుకు సెట్ చేసుకుంటోంది. దీనికి మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం రిపోర్ట్ చూద్దాం పదండి

అనాథ అయిన కృష్ణ(నరేష్ అగస్త్య)కష్టపడి చదివి పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరతాడు. ఐపిఎస్ కావడం లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగా పని చేస్తుంటాడు. ఓ క్రిమినల్ ని వెంటాడుతున్న టైంలో కృష్ణ సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకుంటాడు. దాన్ని వెతికి తీసుకురమ్మని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాస్తా సామాన్యుడైన కృష్ణమూర్తి(రాజేంద్రప్రసాద్)చేతికి చిక్కుతుంది . దాంతో అతను ఏమైనా హత్యలు చేశాడా, కృష్ణ ఎదురుకున్న సమస్యలు ఏమిటి, చివరికి ఈ ఇద్దరి ప్రయాణం ఎక్కడికి చేరింది, కృష్ణమూర్తి ఎందుకు ఇదంతా చేశాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాలి.

పవన్ సాధినేని దీన్ని ఎంగేజింగ్ గా తీర్చిదిద్దడంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో తొలిసగం ల్యాగ్ కు గురైనప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే సంతృప్తినే మిగిలిస్తుంది. నరేష్ అగస్త్య బాగానే చేశాడు కానీ ఇంకొంచెం బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చి ఉంటే బాగుండేది. రాజేంద్రప్రసాద్ అనుభవం గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. జోష్ రవి, హర్షవర్ధన్, రాకేందుమౌళి తదితర ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా సాగడం సేనాపతికి అతి పెద్ద ప్లస్సు. టికెట్ కోసం డబ్బు, థియేటర్ కు వెళ్లి రావడానికి పట్టే సమయం ఆదా చేసే కోణంలో చూస్తే ఇలాంటి జానర్ ఇష్టపడే వాళ్ళకు సేనాపతి పూర్తి పైసా వసూల్ ఎంటర్ టైనర్ గా చెప్పుకోవచ్చు

Also Read : RRR Postpone : మూవీ లవర్స్ కి న్యూ ఇయర్ షాక్ ?