iDreamPost
android-app
ios-app

నటరాజ్ మాస్టర్ అవుట్ – గేమ్ పేరుతో అర్ధనగ్న నృత్యాలు

  • Published Oct 04, 2021 | 4:54 AM Updated Updated Oct 04, 2021 | 4:54 AM
  • Published Oct 04, 2021 | 4:54 AMUpdated Oct 04, 2021 | 4:54 AM
నటరాజ్ మాస్టర్ అవుట్ – గేమ్ పేరుతో అర్ధనగ్న నృత్యాలు

రేటింగ్స్ కోసం కిందా మీద పడుతూ మొదటి నాలుగు సీజన్లంత రెస్పాన్స్ రాక కిందామీద పడుతున్న బిగ్ బాస్ మెల్లగా గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఇదేమి లైవ్ షో కానప్పటికీ కేవలం మాస్ ప్రేక్షకులను మెప్పించడం కోసం అవసరం లేని మసాలాని జొప్పించి మరీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆఖరికి సరైన గేమ్స్ లేక నిన్న చాలా సేపు పార్టిసిపెంట్స్ తో పాటలకు డాన్సులు చేయించడం చూస్తే పరిస్థితి ఎంత కిందకు వెళ్లిపోయిందో చెప్పకనే చెబుతోంది. ఒకదశలో నాగార్జున సైతం నిస్సహాయంగా మారిపోయి హౌస్ లో సభ్యులు చేస్తున్న ఓవరాక్షన్ కి నవ్వాలో ఏడవాలో తెలియని స్టేజిలో కనిపిస్తున్నారు.

నిన్న అందరికీ ముందే తెలిసిపోయినట్టే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఎప్పటిలాగే మంచి మెలో డ్రామాను సిద్ధం చేసి పార్టిసిపెంట్స్ తో కన్నీళ్ల పర్వం నడిపించారు. నిన్నే పెళ్లాడతా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు అందులోని పాటలకు డాన్సు చేయడం బాగానే ఉంది కానీ ఆ తర్వాత వేసిన సాంగ్స్ కి జరిగిన రచ్చ మాత్రం మామూలుది కాదు. ముఖ్యంగా అవసరం లేకపోయినా విశ్వ చొక్కాని విప్పి మరీ ప్రియాంక సింగ్ గెంతులు వేయడం ఓవర్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఇలాంటి షోలలో అర్ధ నగ్న నృత్యాలతో బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి.

ఇదంతా అనుకోకుండా జరిగింది మాత్రం కాదు. ఎందుకంటే షో షూటింగ్ అయ్యాక ఎపిసోడ్ ని ఎడిట్ చేశాకే టెలికాస్ట్ కు వదులుతారు. ఉంచాలో వద్దో నిర్ణయించేది డైరెక్టర్. కానీ ఈ ట్రాక్ ని యథాతథంగా పెట్టేశారంటే దానికి అర్థం కావాలనే ప్లాన్ చేశారని. విశ్వ బాడీని, ప్రియాంక హాట్ ఎక్స్ ప్రెషన్స్ ని ఏదో ఐటెం సాంగ్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఇక నటరాజ్ మాస్టర్ వెళ్తూ ఎప్పటిలాగే మిగిలిన వాళ్ళ గురించి తన అభిప్రాయాలు బయట పెట్టేశాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ బాధ మాత్రం ప్రోగ్రాం డిజైన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం చూడాలనే ఉద్దేశంతో జోడిస్తున్న మసాలా వికటిస్తుందో మరి లేక ఇంకో ఫలితాన్ని ఇస్తుందో చూడాలి

Also Read : నెవర్ బిఫోర్ సాహసం చేస్తున్న నాని

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom