ఆర్టీసీ వ్యవస్థ అనేది రవాణ వ్యవస్థల్లో అత్యంత కీలకమైనది. ముఖ్యంగా ప్రజలను.. వారి గమ్య స్థానాల్లో చేర్చే విషయంలో ఆర్టీసీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఆర్టీసీ వ్యవస్థ ఉంది. వారి వారి ప్రాంతాలకు తగినట్లు ఆర్టీసీల్లో సౌకర్యాలు కల్పిస్తుంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ సంస్థలు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా కేరళ ఆర్టీసీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కండక్టర్లకు కరాటే శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలోని మహిళా కండక్టర్లపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆత్మరక్షణ కోసం కరాటే విద్యా అవసరమని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు వారికి కరాటే నేర్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆర్టీసీలోని కండక్టర్లతో పాటు డ్రైవర్లకు కూడా కరాటే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి విడతలో గురువారం కేరళ పోలీస్ అకాడమీలో మహిళల ఆత్మరక్షణ విద్య కేంద్రంలో కొందరు మహిళా కండక్టర్లు, ఓ మహిళా డ్రైవర్ కు శిక్షణ ఇవ్వనున్నారు.
తొలి విడత శిక్షణకు తిరువనంతపురం ఉత్తర, దక్షిణ విభాగాల నుంచి 13 మంది కండక్టర్లను ఎంపిక చేశారు. కేఎస్ఆర్టీసీ-స్విఫ్ట్ లో డీజిల్, ఎలక్ట్రికల్ బస్సులు సుదూర ప్రాంతాలకు నడుస్తున్నాయి. ఈ విధుల్లో లేడీస్ ను కూడా భాగం చేశారు. కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందికి ఏదైనా ఆపద వస్తే.. తమను తాము రక్షించుకునే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన ఉద్యోగులందరూ కచ్చితంగా శిక్షణకు హాజరయ్యేలా చూడాలని సంబంధిత డిపో మేనేజర్లను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. మరి.. కేఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మణిపూర్ వీడియో ఘటనపై CM ఆగ్రహం.. వారిని ఉరి తీసే ఆలోచనలో ఉన్నాం!