iDreamPost
iDreamPost
ఇంతకుముందు వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీం, బెంగళూరు ఈద్గా మైదాన్ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఆ మైదానంలో గణేష్ వేడుకలను నిర్వహించరాదని తేల్చిచెప్పింది.
గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఈద్గా మైదానాన్ని బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు వినియోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందన్న విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అందుకే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ తీర్పు నిచ్చింది
కాని, జస్టిస్‌లు హేమంత్ గుప్తా, సుధాన్‌షు ధులియాల ద్విసభ్య ధర్మాసనం, న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనందున, త్రిసభ్య ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. కొత్త బెంచ్‌లో న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, ఎఎస్ ఓకా, ఎంఎం సుందరేష్ ఉన్నారు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ ముందు ప్రస్తావించేందుకు కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్వేచ్ఛను ఇచ్చింది.
ఆగస్ట్ 25న, కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్, ఈ భూమిని ఆటలకు, ప్రభుత్వ కార్యక్రమాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చని పేర్కొంది. ముస్లింలు రెండు ఈద్‌లలో ప్రార్థనలు చేయవచ్చనని చెప్పింది. కాన, రోజు తర్వాత, అప్పీల్‌పై డివిజన్ బెంచ్ ఆర్డర్‌ను సవరించింది. భూమిపై నిర్ణయం తీసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
గణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలన్న ఆలోచనలపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ న్యాయవాది, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయంపై అత్యవసర విచారణను కోరారు. ఈ భూమి దశాబ్దాలుగా ముస్లింల వాడుకలో ఉందని సిబల్ చెప్పారు. ఇప్పుడు గణేష్ ఉత్సవాలకు అనుమతినిస్తే అనవసరమైన ఉద్రిక్తతలు రేగవచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు