తమిళ రాజకీయాలను సినిమా సంస్కృతి నుంచి విడదీసి చూడలేం. తమిళనాట ప్రతి రాజకీయ కదలిక థ్రిల్లర్ సినిమాను మరిపిస్తుంది. జైలుకు వెళ్లడానికి ముందు శశికళ చెన్నై మెరీనా బీచ్‌లో ‘అమ్మ’ సమాధి వద్ద మూడు ‘భీషణ ప్రతిజ్ఞ’లు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
‘మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రత్యర్థులను, కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోను..’ అంటూ జయ సమాధిపై తన కుడిచేయితో మూడుసార్లు గట్టిగా చరిచి ‘చిన్నమ్మ’ శపథం చేసింది. ‘పగ సాధిస్తా’నంటూ ఇలా శపథాలు చేయడం సినిమాల్లో తప్ప రాజకీయ వాతావరణంలో చాలా అరుదుగా చూస్తాం. కాని తమిళనాట ఇలాంటివి కామన్. కారణం అక్కడ వ్యక్తి పూజ వెర్రితలలు వేస్తుంది. అదే కారణం. అభిమానించే వారు ఎన్ని తప్పులు చేసినా, జైలుకు వెళ్ళినా.. తమిళులు తమ గుండెల్లో ఉన్న అభిమానాన్ని రవ్వంత చెరగనివ్వరు. అదే ప్రస్తుతం శశికళకు వరం కాబోతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే తమిళుల అమ్మ.. జయలలిత నెచ్చలి శశికళ. ఆమె అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి తిరిగి వస్తున్నారు. జైలుకెళ్లేప్పుడే జయ సమాధిని సందర్శించి వెళ్లిన శశి,జైలు నుంచి చైన్నైకి వచ్చినప్పుడు జయసామధిని సందర్శించకుండా ఉంటారా? తమిళ ప్రజల్లో జయ సెంటిమెంటును తట్టిలేపకుండా ఉంటారా? ఆమె చెన్నై వచ్చినప్పుడు జరిగేదిఅదే.
వివరాల్లోకి వెళితే.. అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవించిన దివంగత సీఎం జయ నెచ్చలి శశికళ.. శిక్షాకాలం పూర్తి చేసుకొని నేడు విడుదల కానున్నారు. ఆమెపేరులో కళ ఉంది.అది జయ ద్వారా వచ్చిందే. ఆ కళ పోయింది..పాపం శశి జైలు పాలయింది.లేదంటే జయ బతికే ఉంటే శశికి ఇంతటి దుస్థితి వచ్చేది కాదు. మరోవైపు ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో శశికళ చికిత్స పొందుతున్నారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రిలోనే ఆమెకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేయనున్నారు. ఆ తర్వాత శశి ఆ ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తారా లేక వేరే ఆస్పత్రికి మకాం మారుస్తారా అన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.అయితే అనారోగ్యం కారణంగా మరికొద్ది రోజులపాటు బెంగళూరు లోనే బసచేస్తారని సమాచారం. పూర్తిగా ఆరోగ్యం కుదుటు పడిన తర్వాత ఫిబ్రవరి మొదటివారంలో ఆమె చెన్నై నగరానికి వచ్చేచాన్స్ ఉందని అభిజ్ఞవర్గాలు బోగట్టా.ఎందుకంటే రాజకీయాలంటేనే ఒత్తిడి అధికంగా ఉంటుంది.
మరి శశికల చెన్నై వచ్చిందంటే..అటు అభిమానుల నుంచి,యిటు ప్రత్యర్ధుల నుంతి మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం చెడిపోయిందే..జైలులో ఉన్న కాలంలో ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడే కారణనని తెలుస్తోంది. అందుకే ఆరోగ్యం విషయంలో పుర్తిగా కోలుకున్న తర్వాత, బెంగళూరు నుంచే ప్రత్యర్థులను ఢీకొట్టే ప్రాణాళికలు రూపొందించుకొని, కత్తులు కటార్లు సిద్ధం చేసుకొని ..సమరానికి సై అంటూ ఆడ సివంగిలా ప్రత్యర్థులపై దూకేందుకు రానుందని తెలుస్తోంది.