iDreamPost
iDreamPost
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు తాను మద్దతు ఇవ్వలేదని NCP అదినేత శరద్ పవార్ ప్రకటించాడు. ఈ ప్రకటనలోని విశ్వసనీయత ఎంతా ? అనేది తేలటానికి కొంత సమయం పడుతుంది.
శరద్ పవార్ మాట కాదని,ఆయన నాయకత్వాన్ని ధిక్కరించి అజిత్ పవార్ బీజేపీ కి మద్దతు ఇచ్చి,ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే రాజకీయ వర్గాలే కాదు ,సామాన్యులు కూడా నమ్మరు.
ఎన్నికల ముందు శరద్ పవార్ మీద ED ని ప్రయోగించినా భయపడని శరద్ పవార్, కాంగ్రెస్-NCP కూటమి ప్రచారాన్ని తన భుజాల మీద మోశారు. రాహుల్ గాంధీ,సోనియా ప్రచారానికి దూరంగా ఉన్నా ఇవే తన చివరి ఎన్నికలు అన్నట్లు శరద్ పవార్ ఎండనకా,వాననకా ప్రచారం చేశారు. అజిత్ పవార్ నిజంగానే శరద్ పవార్ మాటను ధిక్కరించాడా?లేక శరద్ తెరవెనుక రాజకీయం చేశాడా? మరి కొన్ని గంటలలో తేలిపోతుంది.