iDreamPost
iDreamPost
ఆసియా కప్ గ్రూప్-ఎ పోరులో ప్రత్యర్థి పాక్ తో ఆదివారం మ్యాచ్‌లో టీమిండియా చివరి ఓవర్ లో గెల్చింది . హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 33 పరుగులతో భారత్‌ను ఐదు వికెట్ల తేడాతో గెలిపించాడు. నిజానికి పాండ్యూ దూకుడు చూపించకపోతే ఇండియా బాగా ఇబ్బంది పడేది. మరోపక్క రవీంద్ర జడేజా 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. జడేజా, హార్దిక్ ఐదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. మ్యాచ్ ని గెలిపించారు . మ్యాచ్ తర్వాత, సంజయ్ మంజ్రేకర్ జడేజాను ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది.
నాతో జడేజా ఉన్నాడంటూ అడిగిన మొదటి ప్రశ్ననీతో మాట్లాడొచ్చా అని. 2019 ప్రపంచ కప్ సమయంలో మంజ్రేకర్ జడేజాను “బిట్స్ అండ్ పీస్” క్రికెటర్ అని పిలిచాడని, జడేజా సోషల్ మీడియాలో మంజ్రేకర్ ని తిట్టిపోశాడు “ఇప్పటికీ నేను మీ కంటే రెండింతలు మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడుతున్నానని కౌంటర్ ఇచ్చాడు.
అందుకే ముందు నువ్వు నాతో మాట్లాడటానికి ఒకేనా అని మంజ్రేకర్ అడిగితే యా, నాకు ఏ సమస్య లేదని సమాధానమిచ్చాడు. పాక్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ, జడేజా షమేం చివరి వరకు ఆడాలనుకున్నాం, వాళ్ల బౌలింగ్ ఎటాక్ బాగుంది. వాళ్ల ఫాస్ట్ బౌలర్లు రన్స్ ఇవ్వరు. నేను ఆటను ముందుగానే పూర్తిచేయాలనుకున్నా. కానీ హార్దిక్ అద్భుతంగా ఆడాడు. పాండ్యా వచ్చాడు, ఆ పరిస్థితుల్లో ఎలా ఆడాలో చాలా క్లారిటీతో వచ్చాడు. నా షాట్లను ఆడబోతున్నానని చెప్పాడు. అతను చివరి వరకు ఆడినందుకు నేను సంతోషంగా ఉన్నానని జిడ్డూ చెప్పాడు. మొత్తానికి స్టార్ కామెంటేటర్, స్టార్ ఆల్ రౌండర్ల మధ్య రేగిన రగడ సమసిపోయిందనే అనుకోవచ్చు.