iDreamPost
android-app
ios-app

Samsung Galaxy M13 5G: రూ. 13,999 ఫోన్‌కి 12GB ర్యామ్, 5000mAh బ్యాటరీ

Samsung Galaxy M13 5G: రూ. 13,999 ఫోన్‌కి 12GB  ర్యామ్, 5000mAh బ్యాటరీ

శాంసంగ్ ఇప్పుడు బడ్జెట్ ఫోన్లపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన M13 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను చూసినవారు ఎవరైనా ఈ మాట చెప్పడం ఖాయం.

సాధారణంగా కనీస బడ్జెట్ ఫోన్లలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, పాటు ల్యాగ్ ఫ్రీ పనితనం.. ఈ రెండు ఉండటం చాలా అరుదు. ఆ సెగ్మెంట్ నే లక్ష్యంగా చేసుకున్న గెలాక్సీ M13 5జీ.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ వరకు ర్యామ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫోన్ ను అక్వా గ్రీన్, స్టార్ డస్ట్ బ్రౌన్, మిడ్ నైట్ బ్లూ, వంటి 3 రంగుల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత్ లో శాంసంగ్ గెలాక్సీ M13ధర రూ. 11,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ మోడల్ లో 4G, 5G వేరియంట్లు మార్కెట్లోకి రానున్నాయి.

M13 4జీ వేరియంట్ లో 4జీబీ ర్యామ్/64జీబీ, 6జీబీ ర్యామ్/128జీబీ మోడల్స్  ను సైతం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది శాంసంగ్. అయితే దీని ధర రూ. 13,999 వరకు ఉంటుంది. 5జీ వేరియంట్లోనూ 4జీబీ ర్యామ్/64జీబీ ధర 13,999 ఉంటే, 6జీబీ ర్యామ్ /128జీబీ ధర 15,999 ఉంది.

ఇక శాంసంగ్ గెలాక్సీ M13 5జీలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ మరియు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందిస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 5జీ ఎస్ఓసీ ప్రాసెసర్ తో ఈ ఫోన్ రన్ అవుతుంది. 5,000mAh బ్యాటరీ సపోర్టుతో పాటు 15W ఛార్జింగ్ సపోర్టు కలిగిన బ్యాటరీని అందిస్తోంది. ముందువైపు డ్యూయల్ కెమెరాతో నిండిన 50ఎంపీ సెటప్ ను ఇస్తుండగా, సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరాను ఇస్తోంది.

M13 4జీలో 6.6 అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో పాటు ఇంటర్నల్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ ఉంది. ఈ మోడల్ లో 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. అయితే 15W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఉండటం గమనార్హం. ముందు వైపు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ను ఇచ్చింది శాంసంగ్. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలకు అనువుగా 8ఎంపీ కెమెరాను అందిస్తోంది.