iDreamPost
android-app
ios-app

సమంతా హారర్ ప్లానింగ్

  • Published Sep 20, 2022 | 2:03 PM Updated Updated Dec 05, 2023 | 1:09 PM

కన్మణి రాంబో ఖతీజ (కెఆర్కె)లో విజయ్ సేతుపతి, నయనతారలతో స్క్రీన్ పంచుకున్నప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం తన రెండు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

కన్మణి రాంబో ఖతీజ (కెఆర్కె)లో విజయ్ సేతుపతి, నయనతారలతో స్క్రీన్ పంచుకున్నప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం తన రెండు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

  • Published Sep 20, 2022 | 2:03 PMUpdated Dec 05, 2023 | 1:09 PM
సమంతా హారర్ ప్లానింగ్

పుష్ప 1 ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహు అంటావా బ్లాక్ బస్టర్ అయ్యాక సమంతా ఫుల్ లెన్త్ లో కనిపించిన సినిమా ఒకటే. కన్మణి రాంబో ఖతీజ (కెఆర్కె)లో విజయ్ సేతుపతి, నయనతారలతో స్క్రీన్ పంచుకున్నప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం తన రెండు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం ఎప్పుడో పూర్తి కాగా యశోద పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రెండింటిలో టైటిల్ రోల్ సామ్ దే. రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేయలేదు కానీ ఈ ఏడాది చివరిలోపే థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఇది కాకుండా తను విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి షూటింగ్ ఇంకా బాలన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

ఏవో వ్యక్తిగత కారణాల వల్ల రెండు నెలలు సామ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఖుషి వచ్చే ఏడాది వేసవికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ న్యూస్ అయితే జోరుగా ప్రచారంలో ఉంది. చిన్న చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని అందుకే తను ఇన్వాల్వ్ అవుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన దర్శక నిర్మాతలకు ఆల్రెడీ చెప్పేసిందట. సోషల్ మీడియాలో తాను స్వయంగా చెప్పేదాకా ఇదంతా కన్ఫర్మ్ చేయలేం కానీ చుట్ట వెలిగించకుండా పొగ రాదుగా. ఇదిలా ఉండగా సమంతా త్వరలో ఒక హారర్ మల్టీ వర్స్ మూవీ చేయబోతున్నట్టు బాలీవుడ్ అప్ డేట్. బ్రహ్మాస్త్ర తరహాలో మూడు నాలుగు భాగాలు ప్లాన్ చేస్తారట.
Samantha Horror planing
ఆయుష్మాన్ ఖురానా వ్యాంపైర్ గా నటించబోతున్నట్టు తెలిసింది. అంటే డ్రాకులా టైపు క్యారెక్టర్ అన్న మాట. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించబోతున్నాడు. స్త్రీ, బాలా లాంటి సూపర్ హిట్లు తీసింది ఇతనే. సామ్ తో ప్లాన్ చేసుకున్న సినిమాలో హారర్ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయని వినికిడి. ఇది కాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డికె చేయబోయే మరో కొత్త వెబ్ సిరీస్ లోనూ తనే మెయిన్ లీడ్ గా చేసే ప్రపోజల్ ఉంది. మొత్తానికి చైతుతో విడాకులు తీసుకున్నాక సామ్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా ఉంటోంది. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలనే ఏరికోరి ఎంచుకుంటోంది. పుష్ప తర్వాత అలాంటి పాటలకు మరిన్ని ఆఫర్లు చాలానే వచ్చినా అన్నీ నో చెప్పేసింది

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet