iDreamPost
android-app
ios-app

చైతూతో ఎందుకు విడిపోయిందో ఆ షోలో సమంత చెప్పేసిందా??

  • Published Jun 22, 2022 | 6:45 AM Updated Updated Jun 22, 2022 | 6:45 AM
  • Published Jun 22, 2022 | 6:45 AMUpdated Jun 22, 2022 | 6:45 AM
చైతూతో ఎందుకు విడిపోయిందో ఆ షోలో సమంత చెప్పేసిందా??

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, నాగ చైతన్య కొన్ని నెలల క్రితం విడిపోయారు. వీరి విడాకులు తెలుగురాష్ట్రాల్లో ఇప్పటికి హాట్ టాపిక్కే. అయితే వీరు ఎందుకు విడిపోయారో మాత్రం ఎవరికీ తెలీదు. వీళ్ళు కూడా చెప్పలేదు. కానీ బయట జనాలు, ఛానల్స్, సైట్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు వీళ్లిద్దరి గురించి. కొన్ని సార్లు ఇవి శృతిమించడంతో సమంత సీరియస్ అయి ట్రోలర్స్ కి గట్టి సమాధానం కూడా ఇచ్చింది. చైతూ మాత్రం విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు కూడా దాని గురించి మాట్లాడటం చేయలేదు.

బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ త్వరలో ప్రారంభమవ్వబోతుంది. ఇన్నాళ్లు టీవిలో టెలికాస్ట్ అయినా ఈ షో ఈ సారి జులై 7 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. అయితే ఈ సారి బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ షోలో కనిపించనున్నారు. ఇప్పటికే పలు సెలబ్రిటీలతో షూట్ కూడా అయిపోయినట్టు అధికారిక సమాచారం. అందులో సమంత ఒకరు. సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం సమంతకి బాలీవుడ్ లో దాదాపు 3 ప్రాజెక్టులు ఉన్నాయి. సమంత ఈ సారి కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్నట్టు, ఇప్పటికే షూట్ కూడా అయిపోయినట్టు సమాచారం. అయితే ఈ షోలో నాగచైతన్యతో తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పినట్టు సమాచారం. మొదటిసారి విడాకుల తర్వాత కెమెరా ముందు నాగ చైతన్య గురించి మాట్లాడిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో సామ్‌ అభిమానులతో పాటు అటు చైతూ ఫ్యాన్స్‌ కాఫీ విత్ కరణ్ లో సమంత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి సమంత ఎందుకు నాగచైతన్యతో విడిపోవాల్సి వచ్చిందో తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ వచ్చేదాకా టెలికాస్ట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet