iDreamPost
android-app
ios-app

koffee with karan season 7 నాగ చైత‌న్య‌తో విడిపోవ‌డంపై స‌మంత షాకింగ్ కామెంట్స్, మా ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో ఉంచితే, అక్క‌డ ప‌దునైన ఆయుధాలులేకుండా చూడాలి

  • Published Jul 22, 2022 | 5:55 PM Updated Updated Jul 22, 2022 | 6:09 PM
  • Published Jul 22, 2022 | 5:55 PMUpdated Jul 22, 2022 | 6:09 PM
koffee with karan season 7 నాగ చైత‌న్య‌తో విడిపోవ‌డంపై స‌మంత షాకింగ్ కామెంట్స్, మా ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో ఉంచితే, అక్క‌డ ప‌దునైన ఆయుధాలులేకుండా చూడాలి

కాఫీ విత్ కరణ్ 7 మూడో ఎపిసోడ్ స‌న్సేష‌న్ అయ్యింది. సమంతతోపాటు అక్షయ్ కుమార్ ఈ షోలో ఉన్నారు. అయితే షోలో, సామ్ ఎప్పుడూ లేనంత‌గా నిక్కచ్చిగా ఉంది. కష్ట సమ‌యాల గురించి మాట్లాడింది. విడిపోవ‌డం గురించి క్లియ‌ర్ గా చెప్పింది. ఈ షోలో ఆమె నాగ చైతన్యతో ఎలాంటి అనుబంధంకూడా లేద‌ని అంగీకరించింది. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచితే, మీరు పదునైన వస్తువులను దాచాలి వంటి కఠినమైన భావాలున్నాయి.

విడిపోవ‌డం అంత సులువుగా జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. త‌మ మ‌ధ్య వ్య‌క్తిగ‌త జీవితంలో స‌ఖ్య‌త లేద‌ని, ఒక‌వేళ మా ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో ఉంచితే, అక్క‌డ ప‌దునైన ఆయుధాలులేకుండా చూడాల‌ని కామెంట్ చేశారు. ఈ స‌మ‌యంలో ఆమె చాలా క‌ఠిన‌మైన మాట‌లు వాడారు.

ఈ స‌మ‌యంలో హోస్ట్ క‌ర‌ణ్ జోహార్, నీ భ‌ర్త నుంచి విడిపోయినప్పుడు, నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావ‌ని అడిగితే, భ‌ర్త కాదు, మాజీ భ‌ర్త అని క‌ర‌ణ్ ను కరెక్ట్ చేశారు. దీనికి ఆయ‌న సారీ కూడా చెప్పారు.

మేమిద్ద‌రం విడిపోయినప్పుడు నాపై నెగిటీవ్ ప్రచారం చేశారు. స్పందించాల‌నుకున్నా, నాద‌గ్గ‌ర స‌మాధానాల్లేవ్. నేను ఓపెన్ గా ఉండాల‌నుకున్నా. అందుకే విడిపోయిన విష‌యాన్ని అంద‌రికీ షేర్ చేశా. ఆ తర్వాత కొద్ది రోజుల‌కే ఊ అంటావా సాంగ్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ పాన నాకు న‌చ్చింది. అందుకే యాక్ట్ చేశా. ఈ పురుషాధిక్య స‌మాజంలోని వారిలోని లోపాల‌ను ఎత్తిచూపించ‌డానికి ఈ పాటే స‌రైంది. నాలాంటి స్టార్ చెబితే త‌ప్ప‌కుండా అంద‌రికీ చేరువ అవుతుంద‌ని భావించాన‌ని స‌మంత షోతో షేర్ చేసుకున్నారు.


విడాకుల త‌ర్వాత భ‌ర‌ణం కింద రూ.250కోట్లు తీసుకున్నాన‌ని జ‌రిగిన ప్ర‌చారంపైనా స‌మంత షోలో స్పందించారు. వాటిని చూసి మొద‌ట షాక్ అయ్యా. ఆ వార్త‌లు చూపి, ఎవ‌రైనా ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు మా ఇంటికొచ్చి దాడులు చేసి, అవ‌న్నీ గాసిప్స్ అని చెబితే బాగుండున‌ని అనుకొనేదాన్ని అని అన్నారు.

శోభితా ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ పుకార్లు పుట్టించిన‌ట్లు వచ్చిన క‌థ‌నాల‌నూ సమంత త‌ప్పుబ‌ట్టారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş