iDreamPost
android-app
ios-app

ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా

  • Published Feb 01, 2023 | 3:27 PM Updated Updated Feb 01, 2023 | 3:27 PM
  • Published Feb 01, 2023 | 3:27 PMUpdated Feb 01, 2023 | 3:27 PM
ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా

గత ఏడాది వ్యాధి వల్ల ఆసుపత్రి బెడ్డుకే పరిమితం కావాల్సి వచ్చిన సమంతా ఎట్టకేలకు పూర్తిగా కోలుకుని షూటింగులకు వచ్చేసింది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ముంబైలో లాక్ అయిపోయింది. అయితే చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఖుషికి కాకుండా దీనికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల రౌడీ ఫ్యాన్స్ అలక బూనారు. వాళ్ళను బుజ్జగించేందుకు అన్నట్టుగా ట్విట్టర్ వేదికగా త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పి ఊరట కలిగించింది. అయితే తెలుగు సినిమాకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇలా చేయడం పట్ల సరైన క్లారిటీ లేకపోయింది.
Lo
సిటాడెల్ ని ఫ్యామిలీ మ్యాన్ ద్వయం రాజ్ అండ్ డికె తీస్తున్నారు. వరుణ్ ధావన్ తో పాటు విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణంలోనే దీని మీద భారీ అంచనాలున్నాయి. బడ్జెట్ సైతం అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ మూవీ రేంజ్ లో ఖర్చు పెడుతోంది. అయితే సమంతా ఇలా చేయడం వెనుక కారణం ఏమిటా అని ఆరా తీస్తే సదరు సిటాడెల్ లో ఉన్నవాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు కావడంతో డేట్లు అడ్జస్ట్ చేయడం ఇబ్బంది కనక తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని సన్నిహితుల మాట

ఇక ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన శాకుంతలంని వాయిదా వేశారు. పఠాన్ బాక్సాఫీస్ రన్ స్ట్రాంగ్ గా ఉండటంతో హిందీ వెర్షన్ కి థియేటర్లు దొరకడం కష్టమనే ఉద్దేశంతో నిర్మాతలు గుణ శేఖర్ నిర్మాత దిల్ రాజులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. మొత్తంగా ఈ నెలలోనే ఉండకపోవచ్చు. మార్చిలో ప్లాన్ చేస్తారు. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి బడ్జెట్ రికవర్ చేయాలంటే పబ్లిసిటీని ఆషామాషీగా చేస్తే సరిపోదు. ఆర్ఆర్ఆర్ లాగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అన్ని మీడియాలను కవర్ చేయాలి. దానికి పదిహేను రోజులు సరిపోవు కనక కొత్త డేట్ ఎప్పుడనేది త్వరలోప్రకటిస్తారు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet