iDreamPost
android-app
ios-app

కాఫీ విత్ కరణ్.. ఈ సారి సమంత కూడా.. షూటింగ్ అయిపోయిందా?

  • Published Jun 07, 2022 | 8:45 PM Updated Updated Jun 07, 2022 | 8:45 PM
  • Published Jun 07, 2022 | 8:45 PMUpdated Jun 07, 2022 | 8:45 PM
కాఫీ విత్ కరణ్.. ఈ సారి సమంత కూడా.. షూటింగ్ అయిపోయిందా?

బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. బాలీవుడ్ లో ఉండే ప్రతి స్టార్ ఈ షోకి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటాడు. ప్రస్తుతం ఈ షో కొత్త సీజన్ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. అయితే ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు.

దీంతో కాఫీ విత్ కరణ్ షోలో ఈ సారి సౌత్ స్టార్లని కూడా తీసుకొచ్చి ఈ షోకి మరింత పాపులారిటీ తెద్దామని భావిస్తున్నాడు కరణ్ జోహార్. ఇటీవల సౌత్ సినిమాలు, స్టార్లు బాలీవుడ్ లో పాతుకుపోతున్న సంగతి తెలిసిందే. దీంతో కరణ్ జోహార్ ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ లో చరణ్, తారక్, విజయ్ దేవరకొండ, సమంత, నయనతార.. ఇలా పలు సౌత్ స్టార్లు రానున్నట్టు సమాచారం.


ఇటీవల విజయ్ దేవరకొండ ఈ షోలో పాల్గొన్నట్టు అధికారికంగా పోస్ట్ పెట్టాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో కలిసి లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సమంత కూడా ఈ షో షూటింగ్ ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. చైతూతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో కెరీర్ లో బిజీగా మారింది. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ తో మంచి పేరు రావడంతో బాలీవుడ్ పై మరింత ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సమంత కూడా తాజాగా కరణ్ జోహార్ షోలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

తాజాగా సమంత రెడ్ టాప్ లో క్లివేజ్ కనిపిస్తూ కొన్ని హాట్ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలు కాఫీ విత్ కరణ్ షో నుంచే పోస్ట్ చేసిందని సమాచారం. దీంతో సమంత ఈ షోలో కనపడుతుందని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూట్ చేసిందని, త్వరలోనే టెలికాస్ట్ అవ్వనుందని సమాచారం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom