ఈ దేశపు తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘనత సాధించారు. భారతదేశపు 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. వచ్చే సోమవారం ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాధారణంగా ఈ దేశ రాష్ట్రపతికి జీతం ఎంత ఉంటుంది? అసలు ఆ హోదాలో ఉన్న వారికి ఎలాంటి వసతులు, ఇతర భత్యాలు ఎలా ఉంటాయి? రండి తెలుసుకుందాం.
ఈ దేశంలో అత్యధిక జీతం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. వాటితో పాటుగా ఇతర భత్యాలు ఉంటాయి. అయితే భారత దేశపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రూ. 5 లక్షల జీతం అందుకుంటారు. 2018లో రాష్ట్రపతి జీతం రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం విశేషం.
రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి వైద్య, ప్రయాణ, గృహానికి సంబంధించిన ఖర్చులు ఉచితం. రాష్ట్రపతి జీవిత భాగస్వామి సైతం సదరు వ్యక్తితో పాటుగా ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక రాష్ట్రపతి కార్యాలయ ఖర్చుల కోసం ఏడాదికి 1లక్ష రూపాయలు అందుతాయి.
ఇక రాష్ట్రపతి పదవికి విరమణ చేసిన తరువాత నెల నెలా రూ. 1.5 లక్షల పెన్షన్ ను పొందుతారు. వారి జీవిత భాగస్వామికి కూడా నెలకు రూ. 30,000 చొప్పున సెక్రటేరియల్ సహాయం అందుతుంది
వీటితో పాటు ఎటువంటి అద్దె లేకుండా పదవీ విరమణ పొందిన వారు బంగ్లాలో నివసించొచ్చు. వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోవడంతో పాటు వారి ఖర్చలకు రూ. 60,000 అందుకుంటారు. ఇక జీవిత భాగస్వామితో సహా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఇక రాష్ట్రపతి భవన్ లో 340 గదులుంటాయి. దీనికి అదనంగా మరో రెండు విడిది నివాసాలు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యంత విభాగం రాష్ట్రపి భద్రతా వ్యవహారాలను చూస్తారు.