iDreamPost
android-app
ios-app

ఆ వీడియో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. భోళాశంకర్ ఆఫర్ ను అందుకే కాదనుకున్నా : సాయిపల్లవి

  • Published Jun 13, 2022 | 4:34 PM Updated Updated Jun 13, 2022 | 4:35 PM
  • Published Jun 13, 2022 | 4:34 PMUpdated Jun 13, 2022 | 4:35 PM
ఆ వీడియో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. భోళాశంకర్ ఆఫర్ ను అందుకే కాదనుకున్నా : సాయిపల్లవి

డాక్టర్ నుంచి యాక్టర్ గా మారి.. తనకు వస్తున్న ఆఫర్లను, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన నైజానికి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న నవతరం నటి సాయిపల్లవి. ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసేసిన సాయిపల్లవి – రానా జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో 1990ల్లోని ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా విరాటపర్వం. జూన్ 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. కొన్ని విషయాలను పంచుకుంది. నటిగా ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలన్నీ తనకు సంతృప్తినిచ్చాయని, నటిగా తన కెరీర్ ముగిసిందనిపినపుడు మళ్లీ డాక్టర్ వృత్తిలో అడుగుపెడతానని సాయిపల్లవి పేర్కొంది. ఇక తనను ఒక వీడియో చాలా ఇబ్బంది పెట్టిందని, అప్పట్నుంచి కురచ దుస్తులు వేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.

“డాక్టర్ కోర్సు చదివేటపుడు జార్జియా వెళ్లాను. అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ డ్యాన్స్ నేర్చుకోవాలంటే.. దానికి వీలుగా ఉండే దుస్తులే ధరించాలి. ఆ విషయం అమ్మ-నాన్నలకు చెప్పి వాళ్లు ఓకే అన్నాక, ఆ దుస్తులు నాకు సౌకర్యంగానే ఉంటాయని అనిపించాకే టాంగో నేర్చుకున్నాను. ఆ తర్వాతే ప్రేమమ్ లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నా పాత్రకు చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ అదే సమయంలో జార్జియాలో టాంగో డ్యాన్స్ చేసిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు చేసిన కామెంట్లు చాలా ఇబ్బందిగా అనిపించాయి. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులు వేసుకోకూడదనుకున్నాను. అందుకే ఏ సినిమాలోనూ కురచ దుస్తులు వేసుకోనని ముందే చెప్తాను.”

భోళా శంకర్ సినిమా గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారంటే తనకెంతో ఇష్టమని, ఆయన డ్యాన్స్ పెద్ద అభిమానిని అని చెప్పింది. ” ఎప్పట్నుంచో ఆయనతో నటించాలని కోరిక. కానీ రీమేక్ సినిమాలంటే నాకు భయం. సినిమా విడుదలయ్యాక ఒరిజినల్ తో ఈ సినిమాలోని క్యారెక్టర్లను పోల్చి చూస్తారు. అందుకే భోళాశంకర్ లో అవకాశం వచ్చినా చేయనని చెప్పాను. అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు” అని సాయిపల్లవి స్పష్టం చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet