iDreamPost
android-app
ios-app

కూతురులా స‌ర‌ళ ఫ్యామిలీ బొట్టు పెట్టి, చేతిలో చీరపెట్టారు

  • Published Jun 14, 2022 | 6:09 PM Updated Updated Jun 14, 2022 | 8:05 PM
కూతురులా స‌ర‌ళ ఫ్యామిలీ బొట్టు పెట్టి, చేతిలో చీరపెట్టారు

స‌ర‌ళ‌… ఈ పేరు ఒక సినిమాకు క‌థ‌న‌మైంది. సినిమాలో ఈ పాత్ర‌ను పోషిస్తోంది సాయి ప‌ల్ల‌వి. సినిమా ప్ర‌మోష‌న‌ల్ లో భాగంగా వ‌రంగల్ వెళ్లిన సాయిప‌ల్ల‌వి, సరళ వాళ్ల ఇంటికి వెళ్లింది. అప్పుడు స‌ర‌ళ వాళ్ల అమ్మ, నా చేయి పట్టుకొని తన కూతురితో ఎలా మాట్లాడిందో అలానే మాట్లాడింది. ఎక్కడున్నావ్‌ బిడ్డ, ఎందుకు వెళ్లిపోయావ్‌ అని అనడంతో నేను ఏడుపుని ఆపుకోలేకపోయంటూ సాయి ప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ అయ్యారు. సరళ ఫ్యామిలీని కలిసినందుకు చాలా సంతోషం. అమ్మ నన్ను ఆశీర్వదించి, బొట్టుపెట్టి, చీరనిచ్చి పంపించారు. సరళ ఫ్యామిలీ, మా సినిమా విరాట ప‌ర్వాన్ని చూసి హ్యాపీగా ఫీలైతే చాల‌ని సాయి పల్లవి అన్నారు.

1992వ ప్రాంతంలో, వరంగల్‌ సమీపంలో జరిగిన ఓ యదార్థ సంఘటనల స‌మాహార‌మే విరాట ప‌ర్వం. సరళ ప్రేమ కథ ఇది. ఈ పాత్రని సాయి పల్లవి పోషించారు.

విరాటపర్వంలో స‌ర‌ళ‌పాత్ర‌కు వెన్నెల పేరుపెట్టారు. వెన్నెల నేనే అనుకొని నటించా. డైరెక్ట‌ర్ ఈస్టోరీ చెప్పగానే కొత్తగా అనిపించింది. సరళ ఫ్యామిలీ గోప్య‌త‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా, అక్కడి సంఘటనల ఆధారంగా విరాటపర్వాన్ని తెర‌కెక్కించార‌ని సాయి ప‌ల్ల‌వి చెప్పారు.

కొత్త కొత్త పాత్రలని చేస్తేనే యాక్టర్‌గా నేను ఎదిగినట్లు అవుతుంది. స్క్రిప్ట్‌లో ఉన్నదానికి కంటే బాగా నటిస్తాడని హీరో రాణాను మెచ్చుకుంది. సినిమాలో త‌న పాత్ర గురించి చెబుతూ, ఊళ్లో అమ్మాయిలు ఎలా ఉంటారో సినిమాలో నేను అలా ఉంటాను. అలాగేనేను మాట్లాడుతా. అస‌లు మేకప్‌ లేకుండా నటించాన‌ని చెప్పింది.

త‌న‌కు ఇస్తున్న బిరుదుల గురించి న‌వ్వుతూ, లేడి సూపర్‌ స్టార్‌ అనే బిరుదలను ఫ్యాన్స్ ఏదో ప్రేమతో ఇస్తున్నారు. వాటిని మనసుకు తీసుకోన‌ని, వాళ్ల‌కు నచ్చలా మంచి సినిమాల్లో నటించాలన్న‌ది నా కోరిక అన్నారు. నా సినిమాలన్నీ తెలంగాణ క‌థలే. ఈ ప్రాంత‌ అమ్మాయి పాత్రలనే పోషిస్తున్నాను. గత జన్మలో నేను తెలంగాణలో పుట్టానేమోనంటూ వెన్నెలలా న‌వ్వేశారు.