iDreamPost
android-app
ios-app

అందుకే సాయి పల్లవికి అంత క్రేజ్.. ఆమెని చూసి మిగిలిన హీరోయిన్స్ చాలా నేర్చుకోవాలి..

  • Published Jun 15, 2022 | 9:02 PM Updated Updated Jun 15, 2022 | 9:02 PM
  • Published Jun 15, 2022 | 9:02 PMUpdated Jun 15, 2022 | 9:02 PM
అందుకే సాయి పల్లవికి అంత క్రేజ్.. ఆమెని చూసి మిగిలిన హీరోయిన్స్ చాలా నేర్చుకోవాలి..

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా జూన్ 17న రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సాయి పల్లవి క్రేజ్ మీదే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రోజు రోజుకి సాయి పల్లవి క్రేజ్ పెరుగుతూనే ఉంది. గతంలోనూ, ఇప్పుడు విరాట పర్వం ప్రమోషన్స్ లోను ఆమె క్రేజ్ ప్రూవ్ అవుతూనే ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో సినిమా మొత్తం సాయిపల్లవి చుట్టే నడుస్తుందని, సినిమాకి సాయి పల్లవి మెయిన్ లీడ్ అని, అద్భుతంగా నటించిందని మరింత పొగుడుతూ డైరెక్టర్ వేణు, హీరో రానా ప్రమోషన్స్ చేస్తున్నారు. తన క్రేజ్ ని సినిమాకి ప్లస్ చేసుకోవాలని చూస్తున్నారు.

అయితే సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ ఎక్కడి నుంచో వచ్చి సినిమాకి కోట్లు తీసుకొని షూట్ అవ్వగానే వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్లకి రాను పోను ఫ్లైట్ టికెట్స్, ఇక్కడ సకల రాచ మర్యాదలు చేయాలి, ఆమె అసిస్టెంట్స్ ని చూసుకోవాలి. ఇలా బాగానే మెయింటైన్ చేస్తారు హీరోయిన్స్. ఇక కొంతమంది అయితే ప్రమోషన్స్ కి రావాలంటే మళ్ళీ సపరేట్ గా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ వచ్చినా అన్ని ప్రమోషన్స్ కి రారు. ఒకటో రెండో ఈవెంట్స్, ఇంటర్వ్యూలకి వచ్చి వెళ్ళిపోతారు. చాలా మంది హీరోయిన్స్ ఇవన్నీ నిర్మాతల దగ్గరే వసూలు చేస్తారు.

కానీ సాయి పల్లవి వీళ్ళలాగా కాదు అందుకేనేమో ఆమెకి ప్రేక్షకుల్లో అంత క్రేజ్. సాయి పల్లవి తీరే వేరు. ఆమె నటించిన సినిమాలకి అన్ని ప్రమోషన్స్ కి వస్తుంది. వాటికి సపరేట్ ఛార్జ్ చేయదు. కనీసం వారం నుంచి రెండు వారాలు కేవలం ప్రమోషన్స్ కోసం కేటాయిస్తుంది. ఇప్పుడు విరాట పర్వంకి కూడా దాదాపు రెండు వారాలుగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. తన సినిమా అని భావించి చేస్తుంది. ఈ విషయంలో నిర్మాతలకి కూడా సాయిపల్లవి తెగ నచ్చేస్తుంది. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్స్ సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలి అంటున్నారు.

ఇక అసిస్టెంట్స్ ని కూడా ఎక్కువగా మెయింటైన్ చేయదు. షూటింగ్ టైంలో తప్ప బయట ప్రమోషన్స్ టైంలో అయితే ఒక్కరే అసిస్టెంట్ ఉంటారు. అలాగే ఖరీదైన బట్టలు, హెవీగా మేకప్ లు, భారీగా రెడీ అవ్వడాలు లాంటివి ఏమి చేయదు సాయి పల్లవి. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ ఎన్నింటికి రమ్మని పిలిచినా నవ్వుతూ వస్తుంది, నవ్వుతూ వెళ్తుంది. అందుకే హీరోయిన్స్ లలో సాయి పల్లవి వేరు అంటున్నారు అంతా. ఆమెకి ఇంత క్రేజ్ ఉండడంలో తప్పులేదు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. మొత్తానికి సాయి పల్లవి మాత్రం ఫిదా సినిమాలో చెప్పినట్టు నిజంగానే ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş