iDreamPost
android-app
ios-app

గత జన్మలో ఇక్కడే పుట్టానేమో.. అందుకే ఇలా..

  • Published Jun 15, 2022 | 8:56 AM Updated Updated Jun 15, 2022 | 2:27 PM
  • Published Jun 15, 2022 | 8:56 AMUpdated Jun 15, 2022 | 2:27 PM
గత జన్మలో ఇక్కడే పుట్టానేమో.. అందుకే ఇలా..

రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో మిళితమై ఈ సినిమా తెరకెక్కింది. అనేక వాయిదాల అనంతరం విరాటపర్వం సినిమా జూన్ 17న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ప్రస్తుతం సాయి పల్లవి, రానా, చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఆత్మీయ సభ భారీగా నిర్వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు సినిమా సినిమాకు మధ్య వచ్చే గ్యాప్‌ గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం ఉన్నా లేకున్నా సినిమాలు శాశ్వతంగా ఉంటాయి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను నటించిన సినిమాలు చూసి ప్రేక్షకులు నన్ను మెచ్చుకోవాలనే ఆలోచనతోనే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను. ఫిదా, లవ్‌స్టోరీ, ఇప్పుడు విరాటపర్వం.. ఇలా వరుసగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు వస్తున్నాయి, నాకు నచ్చి చేస్తున్నాను. మా ఇంట్లో ఈ సినిమాలు చేశాక నేను చాలా మారిపోయానని అంటున్నారు. ఒకవేళ గత జన్మలో నేను ఇక్కడే తెలంగాణలో పుట్టానేమో అని తెలిపింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss