iDreamPost

Saamanyudu : కొత్త నెల మొదటి బోణీ డబ్బింగ్ సినిమానే

Saamanyudu : కొత్త నెల మొదటి బోణీ డబ్బింగ్ సినిమానే

ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ రిలీజ్ విశాల్ సామాన్యుడు ఒక్కటే. తమిళ దర్శకుడు శరవణన్ ని పరిచయం చేస్తూ రూపొందిన ఈ యాక్షన్ డ్రామా మీద ఇతనికి గట్టి నమ్మకమే ఉంది. అసలు పోటీ లేకుండా అటు తమిళనాడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సోలో రిలీజ్ దక్కడం అదృష్టమే. అందుకే ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది కానీ అది కామన్ ఆడియన్స్ ని పెద్దగా చేరడం లేదు. కారణం ఇతని మార్కెట్ చానళ్ల క్రితమే బాగా డౌన్ అయిపోవడం. గత ఏడాది చక్ర సోసోగా ఆడింది. ఏదేదో ఊహించుకుని ఎక్కువ రేట్ చెప్పడంతో డిజిటల్ కూడా అమ్ముడుపోక తెలుగు వెర్షన్ ఇంకా ఓటిటికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్నాడు విశాల్.

అభిమన్యుడు నుంచి సమాజానికి సంబంధించిన ఏదో ఒక ఇష్యూ దానికి సంబంధించిన సందేశం ఇవ్వడం విధిగా పెట్టుకున్న విశాల్ ఈ సామాన్యుడులోనూ అదే చేశాడు. కాకపోతే ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. ఒకవేళ అసలు సినిమాలో ఏమైనా కంటెంట్ ఉందేమో చూడాలి. ఫిబ్రవరి 11 ఖిలాడీ వచ్చే దాకా సామాన్యుడుకి ఫ్రీ గ్రౌండ్ ఉంది. కరెక్ట్ గా వాడుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. అసలే మూవీ లవర్స్ థియేటర్ కు వెళ్లేందుకు కారణం లేక అల్లాడిపోతున్నారు. ఏ మాత్రం బాగుందనే టాక్ వచ్చినా చాలు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయిపోతారు. కాకపోతే గత కొన్నేళ్లలో ఒకే హిట్టు ఉన్న విశాల్ కు అదంత సులభమైతే కాదు.

నిజానికి 4వ తేదీకి డిజె టిల్లు లాంటి చిన్న సినిమాలు వచ్చినా బాగుండేది. కానీ ఫస్ట్ కాపీ సెన్సార్ లాంటి కారణాలతో పాటు పబ్లిసిటీకి టైం లేకపోవడంతో అలాంటివి చాలా వాయిదా పడ్డాయి. అందుకే సామాన్యుడికి పోటీ లేకుండా పోయింది. రెండు మూడు చిన్న సినిమాలు ఉన్నాయి కానీ వాటికి ఓపెనింగ్స్ ఆశించడం కూడా కష్టమే. ఒకవేళ విశాల్ కు పందెం కోడి టైంలో ఉన్నట్టు క్రేజ్ కనక కంటిన్యూ అయ్యుంటే ఇప్పుడు మంచి వసూళ్లు దక్కేవి. కానీ అదంతా జరిగిపోయిన గతం. జనవరి మొత్తం బంగార్రాజు తప్ప మిగిలినదంతా నీరసంగా గడిపిన టాలీవుడ్ ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం కూడా డబ్బింగ్ సినిమాతోనే సర్దుకోవాల్సి వస్తోంది

Also Read : Tollywood Release Dates : టాలీవుడ్ వాయిదాలు ఇకనైనా ఆగాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి