iDreamPost
android-app
ios-app

హీరోయిన్లతో అఫైర్లు, ఒళ్లంతా టాటూలు ఉంటేనే టీమిండియాలో చోటు: భారత క్రికెటర్‌

  • Published Jul 21, 2024 | 5:13 PM Updated Updated Jul 21, 2024 | 5:13 PM

Ruturaj Gaikwad, IND vs SL, BCCI: భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కాలంటే బాలీవుడ్‌ హీరోయిన్లతో అఫైర్‌ పెట్టుకోవాలేమో అని భారత వెటరన్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

Ruturaj Gaikwad, IND vs SL, BCCI: భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కాలంటే బాలీవుడ్‌ హీరోయిన్లతో అఫైర్‌ పెట్టుకోవాలేమో అని భారత వెటరన్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 21, 2024 | 5:13 PMUpdated Jul 21, 2024 | 5:13 PM
హీరోయిన్లతో అఫైర్లు, ఒళ్లంతా టాటూలు ఉంటేనే టీమిండియాలో చోటు: భారత క్రికెటర్‌

ఈ నెల 27 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం జట్ల ప్రకటన తర్వాత బీసీసీఐ, సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ భారత క్రికెటర్‌ మాట్లాడుతూ.. టీమిండియాలో చోటు దక్కలంటే.. బాలీవుడ్‌ హీరోయిన్లతో అఫైర్ల​లు పెట్టుకోవాలమో అంటూ ఘాటుగా స్పందించాడు. ఇటీవల శ్రీలంక పర్యటనకు కోసం ప్రకటించిన టీ20, వన్డే టీమ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడంపై భారత క్రికెటర్‌ బద్రినాథ్‌ విమర్శలు గుప్పించాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా.. రుతురాజ్‌ను పక్కనపెట్టడంపై చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేశారు.

హర్భజన్‌ సింగ్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌ లాంటి మాజీ క్రికెటర్లు కూడా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ కోసం రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు. అలాగే సంజు శాంసన్‌ను వన్డే సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదో తమకు అర్థం కాలేదని అన్నారు. అయితే.. తాజాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన తమిళనాడు ఆటగాడు ఎస్‌.బద్రీనాథ్‌ కాస్త ఘాటుగానే టీమిండియా సెలక్షన్‌పై స్పందిస్తూ.. ‘బాలీవుడ్‌ హీరోయిన్లతో అఫైర్‌, ఒళ్లంతా టాటూలు, మంచి మీడియా మేనేజర్‌ ఉంటేనే టీమిండియాలో చోటు దక్కుతుందేమో’ అని వ్యాఖ్యానించాడు.

రుతురాజ​్‌ గైక్వాడ్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ గైక్వాడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌కు.. మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేసినా.. తర్వాతి మ్యాచ్లో 77, మూడో మ్యాచ్‌లో 49 పరుగులు చేసి రాణించాడు. నాలుగో మ్యాచ్‌లో గైక్వాడ్‌కు బ్యాటింగ్‌ రాలేదు. అయినా కూడా ఐదో మ్యాచ్‌లో అతన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఏకంగా టీమ్‌ నుంచే తీసేశారు. అందుకే రుతురాజ్‌కే సర్వత్రా మద్దతు లభిస్తుంది. మరి రుతురాజ్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై బద్రీనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.