iDreamPost
android-app
ios-app

రష్యాకు భారత్ సాయం

రష్యాకు భారత్ సాయం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం రష్యాతో దోస్తీ కొనసాగిస్తోంది. రష్యాకు అసవరం అయితే సహాయం చేస్తానంటోంది. అన్నట్లుగా రష్యా కోరిన సహాయం అందించటానికి భారత్ రెడీ అయ్యింది. భారత్ నుంచి వైద్య పరికరాలు కావాలని రష్యా కోరింది. దీనిపై ఇరు దేశాల మధ్యా చర్చలు జరుగుతున్నాయి.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుండటంతో యూరోప్‌ దేశాలతోపాటు చైనా నుంచి కూడా రష్యాకు దిగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్‌ ప్రభుత్వం భారత్‌ సాయం కోరుతోంది. మరిన్ని వైద్య పరికరాలు అందించాలని కోరింది. ఈ అంశంపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. ఇరుదేశాలకు చెందిన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కంపెనీలు ఈ నెల 22వ తేదీన వర్చువల్‌గా సమావేశం కానున్నాయి. వైద్య సామాగ్రి సరఫరాలను పెంచే మార్గాలపై చర్చించనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరమ్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యా వాణిజ్య వర్గసంఘం ధ్రువీకరించింది.

రష్యాపై పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కొనసాగిన తరహాలో ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ఇరు దేశాలు స్థానిక కరెన్సీల్లో (రూపాయి-రూబుల్‌) చెల్లింపులపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు ఎగుమతుల్ని పెంచే విషయంపై భారత్‌ సమాలోచనలు జరుపుతోంది. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాను ఏకాకిని చేయాలని అమెరికా దాని మిత్రపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş