iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: చెదిరిన 50 ఏళ్ల కల.. చంద్రుడిపై రష్యా ల్యాండర్‌ క్రాష్‌!

బ్రేకింగ్: చెదిరిన 50 ఏళ్ల కల.. చంద్రుడిపై రష్యా ల్యాండర్‌ క్రాష్‌!

పరిశోధనల కోసం రష్యా అంతరిక్ష సంస్థ చంద్రుడిపైకి పంపిన లూనా-25 ప్రయోగం ఫేయిల్‌ అయింది. 50 ఏళ్ల రష్యా కల కలగానే మిగిలిపోయింది. చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే ల్యాండర్‌ విఫలమైంది. జాబిల్లిని చేరుకోవటానికి కొన్ని గంటల ముందే ల్యాండర్‌ కుప్పకూలింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ స్వయంగా వెల్లడించింది. అనియంత్రిత కక్ష్యలో తిరిగిన తర్వాత అది కూలినట్లు తెలిపింది. చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిన వెంటనే అది ధ్వంసం అయిందని వెల్లడించింది.

కాగా, రష్యా దాదాపు 47 ఏళ్ల తర్వాత పరిశోధనల కోసం లూనా-25 ల్యాండర్‌ను పంపింది. ఈ నెల 11న ఈ ల్యాండర్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ ల్యాండర్‌ 21న దక్షిణ ధ్రువంపై దిగేందుకు ప్రయత్నించింది. శనివారం కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఈ సమయంలోనే స్పేస్‌ షిప్‌లోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. అప్పటికే స్పేస్‌ షిప్‌తో సంబంధాలు తెలిగిపోయాయి. అయితే, లూనా-25 కొన్ని గంటల క్రితమే చంద్రుడికి సంబంధించిన ఫొటోలను పంపింది. ఇక, చంద్రుడిపై పరిశోధనలకోసం భారత్‌ పంపిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ..ఇస్రో పంపిన చంద్రయాన్‌ 3 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది.

రెండో చివరి డీ బూస్టింగ్‌ను సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ అత్యంత దగ్గరిగా వెళ్లింది. ఆగస్టు 23న ఈ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతుంది. అన్నీ సక్రమంగా జరిగితే ల్యాండింగ్‌ సక్సెస్‌ ఫుల్‌ అవుతుంది. మరి, చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ పంపిన లూనా-25 ప్రయోగం విఫలమవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.