iDreamPost
android-app
ios-app

శాసనమండలిలో గందరగోళం

శాసనమండలిలో గందరగోళం

శాసనమండలిలో రూల్ 71 కింద చర్చ చేపట్టాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు, మంత్రులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో శాసనమండలిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఏకంగా మంత్రులు, అధికార పక్ష నేతలే పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చెయ్యడం శాసనమండలి చరిత్రలో ఇదే మొదటిసారి. మండలి లో తొలిసారిగా అధికార పక్షమే గొడవ చేయడం వల్ల విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ గందరగోళం మధ్య చైర్మన్ సభని 10 నిమిషాలు పాటు వాయిదా వేశారు.

అయితే ఈ ఉదయం జరిగిన చర్చలో వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున మండలిలో కూడా చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్‌ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదన్నారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌ షరీఫ్ రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.

మండలిలో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొందరు మంత్రులు సైతం రంగంలోకి దిగారు. తాజా పరిణామాలతో మండలిని రద్దు చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.