Idream media
Idream media
 
        
ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది. దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపబడనున్నారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక ఆర్టీసీ విలీనానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నొటిఫికేషన్‌ను జారీ చేయనుంది.
